చక్కెరకు బదులు తేనె వాడేవాళ్లు ఎంతోమంది. వేడి పాలల్లో, టీలో, నీళ్లల్లో తేనెను కలుపుకుని తాగుతుంటారు. వేడి మిశ్రమంలో తేనె కలపడం వల్ల, తేనె కూడా వేడెక్కుతుంది. ఇలా చేయడం వల్ల అది విషపూరితంగా మారే అవకాశం ఉంది. అంతేకాదు దానిలోని పోషక విలువలు కూడా తమ సుగుణాలను కోల్పోతాయి. అంటే ఆ తేనె తాగినా తాగకపోయినా ఒకటే. తేనెను వేడి చేయడం వల్ల అది జిగురులా మారే అవకాశం ఉంది. 


ఆయుర్వేదం ప్రకారం తేనెను వేడి చేయడం లేదా ఉడికించడం వంటివి చేయకూడదు. వేడి వేడి పదార్థాలలో కూడా కలపకూడదు. ఇలా వేడికి గురైన తేనె తాగడం వల్ల విషపూరిత అణువులు జీర్ణ వ్యవస్థ శ్లేష్మ పొరలకు అంటుకుని అమా అనే టాక్సిన్ గా మారుతాయి. దీనివల్ల కడుపునొప్పి కలగవచ్చు. శ్వాసక్రియ, ఇన్సులిన్ సెన్సిటివిటీ, చర్మ వ్యాధులు, బరువు పెరుగడం వంటివి జరుగుతాయి. 


ఎన్నో పోషకాలు...
తేనెలో ఆరోగ్యకరమైన ఎంజైమ్‌లు, అమైనో ఆమ్లాలు, విటమిన్ సి, డి, ఇ, కె, బితో పాటూ బీటాకెరాటిన్, ఎసెన్షియల్ ఆయిల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. కానీ వేడి చేయడం వల్ల ఇవన్నీ వాటి సహజగుణాలను కోల్పోతాయి. అవి ప్రమాదకర సమ్మేళనాలుగా మారచ్చు. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ నివేదిక ప్రకారం కూడా తేనెను వండడం, వేడి చేయడం వల్ల నాణ్యత క్షీణిస్తుంది అని తెలుస్తుంది.


సహజంగానే తినాలి...
తేనెను 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం వల్ల రసాయన మార్పులు తప్పవు. రుచి కూడా చేదుగా మారుతుంది. అందుకే తేనెను సహజంగానే, గది ఉష్ణోగ్రత వద్దనే తినాలి.  


Also read: పిల్ల మామూలుది కాదు, గుద్దితే చెట్లు విరగాల్సిందే... ‘వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ గర్ల్’ వీడియో చూడండి


Also read: ముప్పై ఆరుకోట్ల మంది మాట్లాడే హిందీ, మనదేశ అధికార భాష, కానీ జాతీయ భాష కాదు


Also read: ఫేక్ వార్తలు మనుషుల భావోద్వేగాలను ఎంతగా ప్రభావితం చేస్తాయంటే.... ఓ కొత్త అధ్యయన ఫలితం


Also read: కాఫీ తాగే పద్దతి ఇది... మీ ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు పాటించాల్సిందే


Also read: బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు, పాలు కలిపి తింటున్నారా? ఈ సమస్య ఉన్న వాళ్లు తినకూడదు




 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.