మాస్ మహారాజ రవితేజ (Raviteja) కథానాయకుడిగా అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ సంస్థలపై రూపొందుతున్న సినిమా 'రావణాసుర' (Ravanasura). దీనికి సుధీర్ వర్మ దర్శకుడు. అభిషేక్ నామా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. భోగి సందర్భంగా శుక్రవారం పూజా కార్యక్రమాలతో సినిమా మొదలు అయ్యింది.
రవితేజపై చిత్రీకించిన ముహూర్తపు సన్నివేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి క్లాప్ ఇవ్వగా, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. కె.ఎస్. రవీంద్ర (బాబీ), గోపీచంద్ మలినేని గౌరవ దర్శకత్వం వహించారు. పూజా కార్యక్రమాలు అనంతరం దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు స్క్రిప్ట్ అందించారు. 'రావణాసుర' పోస్టర్‌ను చిరంజీవి విడుదల చేశారు. సినిమా ఓపెనింగ్ రోజునే విడుదల తేదీని అనౌన్స్ చేశారు రవితేజ. ఈ ఏడాది సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
'రావణాసుర' సినిమాలో రవితేజ న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. ఇందులో రాముడిగా సుశాంత్ నటించనున్నట్టు ఇటీవల వెల్లడించారు. అయితే... ఈ సినిమాలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నారో చూశారా? అనూ ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా, 'బంగార్రాజు'లో ఓ పాటలో మెరిసిన దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ - మొత్తం ఐదుగురు నటిస్తున్నట్టు ఈ రోజు చెప్పారు. అందరి పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుందట. రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా, సత్య, జయప్రకాష్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు.
Also Read: 'బంగార్రాజు' మూవీ రివ్యూ: నాగ్ vs చైతు.. బంగార్రాజులు అదరగొట్టారా?
Also Read: అయ్యప్ప దీక్షలో అజయ్ దేవగన్.. శబరిమలైలో ప్రత్యక్షమైన RRR స్టార్
Also Read: 'సూపర్ మచ్చి' రివ్యూ: సూపర్ అనేలా ఉందా? లేదా?
Also Read: రౌడీ బాయ్స్ రివ్యూ: యూత్‌ని మెప్పించే రౌడీ బాయ్స్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి