Ice Disk In US: వామ్మో.. ఇలా ఉందేంటి? అమెరికన్లను వణికిస్తున్న ‘ఐస్ డిస్క్’.. రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రత్యక్షం

ఇలాంటి వింతను మీరు ఎప్పుడూ చూసి ఉండరు. అమెరికాలోని గడ్డ కట్టిన నదిలో కొంత భాగంగా ఇలా గుండ్రంగా మారి గిరగిరా తిరుగుతోంది.

Continues below advertisement

అమెరికన్లలో చాలామంది ఆలోచనలు గ్రహాంతరవాసులు.. ప్రళయం.. చుట్టూ తిరుగుతుంటాయి. వాటికి తగినట్లే అక్కడ అప్పుడప్పుడు.. వింతలు చోటుచేసుకుంటాయి. ఏదో జరిగిపోతుందనే భయాందోళనలు సృష్టిస్తాయి. అయితే, ఇన్నాళ్లు గాల్లో ఎగిరే పళ్లాలు (గ్రహాంతరవాసుల వాహనాలు) గురించి అక్కడ కథలు కథలుగా చెప్పుకొనేవారు. ఇప్పుడు తాజా ఆ జాబితాలో ‘ఐస్ డిస్క్’ వచ్చి చేరింది. కానీ.. ఇది గాల్లో ఎగరదు. నీటిపై వలయాకారంలో తిరుగుతూ ఉంటుంది. భారీ వృత్తాకారంలో ఉండే మంచుగడ్డను కొందరు ప్రకృతే అలా చెక్కిందని అంటుంటే.. కొందరు మాత్రం అది తప్పకుండా గ్రహాంతరవాసుల రాకను సూచిస్తోందని అంటున్నారు. ఎందుకంటే.. అది ఎవరో కచ్చితమైన లెక్కతో అందంగా వృత్తం గీసినట్లుగా ఉంది. 

Continues below advertisement

సాధారణంగా చలికాలంలో అమెరికాలోని చాలా నదులు గడ్డ కట్టేస్తుంటాయి. వెస్ట్‌బ్రూక్ నగరంలోని ప్రీసంప్‌స్కాట్ నదిలో కూడా అదే జరిగేది. అయితే, 2019లో మాత్రం.. నదిలో గడ్డకట్టిన నీరు గుండ్రంగా తిరుగుతూ కనిపించింది. అప్పట్లోనే చాలామంది దాన్ని గ్రహాంతరవాసుల పనేనని అనుకున్నారు. 2020లోని వింటర్ సీజన్లో మాత్రం అది మళ్లీ ఆ తరహాలో కనిపించలేదు. తాజాగా మరోసారి ఈ భారీ డిస్క్ ప్రత్యక్షమైంది. అయితే, దీని పరిమాణం ఎంత ఉందనేది ఇంకా లెక్క వేయలేదు. అయితే, 2019లో ప్రత్యక్షమైన ‘ఐస్ డిస్క్’ చుట్టుకొలత 91 మీటర్లు ఉంది. ఈ ఏడాది ఏర్పడిన ఐస్ డిస్క్ అప్పటికంటే పెద్దగా ఉందని అంటున్నారు. 

నీటిపై తేలుతున్న ఈ ఐస్ డిస్క్‌ను చూసి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నది గడ్డకడితే మొత్తం గట్టిగా మారిపోవాలి. కానీ, ఇలా గుండ్రంగా.. చక్కగా కత్తిరించినట్లుగా మారిపోవడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు. స్థానిక మేయర్ మైఖెల్ టి.ఫోలీ పోస్ట్ చేసిన ఆ చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నిపుణులు స్పందిస్తూ.. నది లోపల ఏర్పడే కరెంట్ (ప్రవాహం), సుడిగుండాల వల్ల ఈ డిస్క్ ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. నది సుడులు తిరుగుతున్నప్పు నీరు క్రమేనా గడ్డకట్టి ఉంటుందని, అందుకే అది అలా గుండ్రంగా కట్ చేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అయితే, ఆ ఐస్ గడ్డ మీదకు ఎక్కేందుకు ప్రజలకు అనుమతి ఇవ్వడం లేదు. ‘ఐస్ డిస్క్ వీడియో, చిత్రాలను ఇక్కడ చూడండి.

Also Read: ఓర్నీ.. చేప వీర్యంతో స్పెషల్ కర్రీ.. అంత కరువేంది బ్రో!

Also Read: ఈ చేప భలే డ్రైవింగ్ చేస్తోంది.. ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసు పెట్టరు కదా?
Also Read: తత్కాల్‌లో రైల్వే టికెట్స్ వేగంగా బుక్ చేయాలా? ఇదిగో ఇలా చేయండి
Also Read: నరక ద్వారం.. 50 ఏళ్లుగా ఇక్కడి భూమి మండుతూనే ఉంది.. చిన్న తప్పు ఎంత పనిచేసింది!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement