హై హీల్స్ మొదట తయారు చేసింది మగాళ్ల కోసం . అవును నమ్మబుద్దికాకున్నా ఇదే నిజం. ఇప్పుడు మనం చూస్తున్న హైహీల్స్‌ వెనుక చాలా పెద్ద చరిత్రే ఉంది. కాలానుగుణంగా మారిన హైహీల్స్‌ నేటి మహిళల ఫ్యాషన్‌లో భాగమైపోయాయి. మహిళల అందానికి అదనపు ఆకర్షణగా మారిపోయింది. 


హైహీల్స్‌ను మొదట ప్యారిస్‌ సైనికుల కోసం తయారు చేశారు. పదో శతాబ్ధంలో వీటిని రూపొందించారు. హైహీల్స్‌ వేసుకున్న సైనికులు ఎత్తుగా కనిపిస్తారు. శత్రువలపై బాణాలు వేసేందుకు వాళ్లకు సరైన పట్టు దొరుకుతుంది. ఇదే ఉద్దేశంతో హైహీల్స్‌తో ఓ ప్రత్యేక సైనిక కేటగిరని క్రియేట్‌ చేశారు అప్పట్లో. అలాంటి వారికి సొసైటీలో ప్రత్యేక గుర్తింపు ఉండేది. వాళ్లను గౌరవంగా చూసేవాళ్లు.  
కొంత కాలం ప్యారిస్‌లో రైడర్స్‌ కూడా హైహీల్స్‌ ధరించేవాళ్లు. స్టేటస్‌ సింబల్‌గా వాడుకునే వాళ్లు. ఈ ట్రెండ్ కాస్తా సరిహాద్దులు దాటి ఐరోపాకు చేరింది. సైనికులు ఎత్తైన వాళ్లుగా కనిపించేందుకు ఐరోపాలో హైహీల్స్ వాడారు. అప్పట్లో దీన్నో పవర్‌ఫుల్‌ మిలటరీ వ్యూహంగా కూడా వాడుకున్నారు. 


పదిహేడో శతాబ్ధం నాటికి ఈ హైహీల్స్‌ ఉన్నత ఐరోపా మహిళల ఫ్యాషన్ గా మారింది. ముఖ్యంగా వెనీస్‌లో మహిళలు ఎక్కువగా ఉపయోగించేవాళ్లు. చాలా ఎత్తైనా హైహీల్స్ వేసుకునే వాళ్లు. ఈ హైహీల్స్ ఇతరులకు కనిపించకుండా దుస్తులు ధరించేవాళ్లు. దీన్ని స్టేటస్ సింబల్‌గా చెప్పుకునేవాళ్లు. 


1673లో పద్నాలుగో లూయీస్‌ రెడ్‌ హీల్స్‌, రెడ్‌ సోల్‌తో కూడిన బూట్లను ప్రవేశపెట్టారు. తమ స్థాయి వ్యక్తులు ఇలాంటి షూలు ధరించి ప్రజలకు దర్శనమివ్వాలని ఆదేశాలు జారీ చేశారాయన. సామాన్యులతో తేడా చూపేందుకు ఈ టైప్‌ షూకోడ్‌ తీసుకొచ్చారు లూయీస్‌.


ఈ రెడ్‌ హీల్స్‌, సోల్‌ ఫ్యాషన్ కూడా తర్వాత కాలంలో ఐరోపాకు ట్రావెల్ అయింది. ఉన్నత వర్గాలు ప్రజలు ఒకరమైన సోల్‌, హీల్స్ ఉన్న షూ వాడితే... సామాన్యులు మరో రకమైన షూ ఉపయోగించేవాళ్లు. ఇలా వాడే హీల్స్‌ను బట్టి సమాజంలో వర్గీకరణ అప్పట్లో ఉండేది.  


1740 తర్వాత క్రమంగా హైహీల్స్ వేయడం మగాళ్లు మానేశారు. తర్వాత 19వ శతాబ్దంలో మళ్లీ లోహీల్స్‌ వేయడం స్టార్ట్ చేశారు. ఒకప్పుడు అధికార దర్పాణానికి చిహ్నంగా వాడే హైహీల్స్‌ నేడు మహిళలకే పరిమితమైపోయింది. 


Also Read: ఈ చేప భలే డ్రైవింగ్ చేస్తోంది.. ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసు పెట్టరు కదా?
Also Read: తత్కాల్‌లో రైల్వే టికెట్స్ వేగంగా బుక్ చేయాలా? ఇదిగో ఇలా చేయండి
Also Read: షాకింగ్ వీడియో: విహారంలో విషాదం.. పర్వతం విరిగి బోటుపై పడింది


Also Read: నరక ద్వారం.. 50 ఏళ్లుగా ఇక్కడి భూమి మండుతూనే ఉంది.. చిన్న తప్పు ఎంత పనిచేసింది!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి