ప్రధాని నరేంద్రమోదీ జనవరి 15న 150కి పైగా అంకుర సంస్థలతో సమావేశం కానున్నారు. దేశ వ్యాప్తంగా స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌కు ఊతం ఇచ్చేందుకు ఆయన ఈ నిర్ణయం తీసున్నారని ప్రధాని కార్యాలయం (పీఎంవో) మీడియాకు తెలిపింది.


వ్యవసాయం, ఆరోగ్యం, వైద్యం, ఎంటర్‌ప్రైజ్‌ సిస్టమ్స్‌, అంతరిక్షం, ఇండస్ట్రీ 4.0, భద్రత, ఫిన్‌ టెక్‌, వాతావరణం, ఇతర రంగాలకు చెందిన అంకుర సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. వ్యాపార నేపథ్యాలకు అనుగుణంగా 150 స్టార్టప్‌లను ఆరు వేర్వేరు బృందాలుగా విభజిస్తున్నామని పీఎంవో అధికారులు వెల్లడించారు. క్షేత్ర స్థాయి నుంచి ఎదుగుతున్న, లోకల్‌ టు గ్లోబల్‌, భవిష్యత్ టెక్నాలజీ, తయారీ, నిలకడైన అభివృద్ధిలో ఛాంపియన్లు.. ఇలా ఆరు బృందాలుగా విభజిస్తారు.


ప్రత్యేకంగా కేటాయించిన థీమ్‌ గురించి ప్రతీ బృందం ప్రధానికి ప్రజెంటేషన్‌ ఇస్తారు. సృజనాత్మకత, వినూత్నను ఉపయోగించుకొని దేశ అవసరాలను స్టార్టప్‌లు ఎలా తీరుస్తున్నాయో అర్థం చేసుకోవడమే ఈ సమావేశం లక్ష్యం. 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవవ్‌'లో భాగంగా వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన డీపీఐఐటీ జనవరి 10 నుంచి 16 వరకు ఓ కార్యక్రమం నిర్వహిస్తోంది. అందులో భాగంగానే స్టార్టప్‌లతో ప్రధాని మోదీ సమావేశం అవుతున్నారు.


'దేశ అభివృద్ధికి ఊతం అందించే సామర్థ్యాలు స్టార్టప్‌లకు ఉన్నాయని ప్రధాన మంత్రి విశ్వాసం. 2016లో స్టార్టప్‌ ఇండియా పథకం ఆవిష్కరించడం దీనిని ప్రతిబింబిస్తుంది. అంకుర సంస్థల స్థాపన, నిర్వహణ, అభివృద్ధికి అవసరమైన పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇది దేశంలోని స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌పై మంచి ప్రభావం చూపిస్తోంది. భారీ యూనికార్న్‌ సంస్థలు రూపొందేందుకు ఉపయోగపడుతోంది' అని పీఎంవో వెల్లడించింది.


Also Read: Budget 2022: దయ చూపాలమ్మా 'నిర్మలమ్మ'! బడ్జెట్‌కు ముందు వేతన జీవుల వేడుకోలు!!


Also Read: Infosys: మీది గ్రాడ్యుయేషన్ అయిందా? ఇన్ఫోసిస్ సంస్థ గుడ్‌న్యూస్, భారీగా ఉద్యోగాలు


Also Read: Doorstep Banking Services: ఇంటి వద్దకే బ్యాంకు! ఒక్క లావాదేవీకి ఎంత తీసుకుంటారో తెలుసా!


Also Read: Condom Use: లాక్‌డౌన్‌లో సెక్స్‌ మర్చిపోయారో ఏంటో!! ప్రపంచంలో అతిపెద్ద కండోమ్‌ కంపెనీకి నష్టాల సెగ!!


Also Read: Budget 2022: టాక్స్‌ పేయర్లకు బడ్జెట్‌ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!