Budget 2022 Telugu, Union Budget 2022: వేతన జీవులు, పింఛన్‌దారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించే అవకాశం కనిపిస్తోంది. త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్ ద్వారా పెరుగుతున్న ద్రవ్యోల్బణం భారం తగ్గించే దిశగా సాగుతున్నట్టు తెలిసింది. పన్ను భారం తగ్గించేందుకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచుతారని సమాచారం. 2022, ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ ద్వారా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెబుతారని అంతా అంచనా వేస్తున్నారు.
పన్ను మినహాయింపు రూ.75వేలకు పెంపు!
ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000గా ఉంది. నిర్మలా సీతారామన్ ఈ పరిమితిని రూ.75,000 లేదా 50 శాతానికి పెంచే అవకాశం ఉంది. ఒకవేళ పెంచితే నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఇది నాలుగో సారి అవుతుంది. బిజినెస్ ఛాంబర్లు, చాలామంది ఆర్థిక వేత్తలు బడ్జెట్‌లో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచి పన్ను చెల్లింపుదారులపై ధరలు, పన్ను భారాన్ని తగ్గించాలని కోరుతున్నారు.
Also Read: ITR Filing Date Extended: టాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్! మార్చి 15 వరకు గడువు పెంపు
Also Read: Vodafone Idea Shareholders: వొడాఫోన్ ఐడియాలో కేంద్రానికి '36%' వాటా.. 19% నష్టపోయిన షేరు!!
పెరిగిన ద్రవ్యోల్బణం
కరోనా మహమ్మారి వచ్చాక ఉద్యోగుల్లో చాలామంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. దీనివల్ల కరెంటు బిల్లు, వడ్డీ ఖర్చులు ఎక్కువయ్యాయి. పిల్లలు ఆన్‌లైన్లో విద్యను అభ్యసిస్తుండటంతో ఖర్చులు అధికం అయ్యాయి. దీనికి తోడు ద్రవ్యోల్బణం వారిని వేధిస్తోంది. పెట్రోలు, డీజిల్, వంట నూనెలు, గ్యాస్, వైద్యం ఇలా అన్నింటి ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఆర్థిక మంత్రి మినహాయింపు పరిమితిని పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. నిజానికి చాలా దేశాల్లో కరోనా తర్వాత ఉద్యోగులను పన్ను పరిధి నుంచి తప్పించారు! దీనినీ కేంద్రం పరిగణనలోకి తీసుకుందని తెలుస్తోంది.
2018లో ఆరంభం
పన్ను చెల్లింపుదారుల ఆదాయం నుంచి ప్రస్తుతం రూ.50,000 వరకు మినహాయింపు ఇస్తున్నారు. 2018లో దివంగత అరుణ్‌జైట్లీ బడ్జెట్‌లో స్టాండర్డ్ డిడక్షన్‌ను ఆరంభించారు. అప్పట్లో పరిమితి రూ. 40,000. ఆ తర్వాత స్వల్పకాలిక బడ్జెట్‌లో పియూష్ గోయెల్ రూ.50,000కు పెంచారు. కొన్నాళ్లుగా ఇందులో మార్పేమీ లేదు. దీనిని ఇప్పుడు రూ.75వేలకు పెంచుతారన్న అంచనాలైతే ఉన్నాయి.
Also Read: CCD New CEO Malavika Hegde: భర్త విధికి తలవంచితే.. ఆమె ఎదిరించి నిలబడింది.. ఓ మంచి కాఫీ లాంటి కథ!
Also Read: Multibagger stock: పెన్నీ స్టాక్.. 2 ఏళ్లు.. లక్ష పెట్టుబడి.. రూ.50 లక్షలు ప్రాఫిట్!
Also Read: PNB Service Charges: కస్టమర్లకు పీఎన్‌బీ షాక్! సర్వీస్ ఛార్జెస్ పెంచేసిన పంజాబ్ బ్యాంక్