కొవిడ్‌ మహమ్మారి తర్వాత భారత స్టాక్‌ మార్కెట్లు బాగా పుంజుకున్నాయి. అన్ని రంగాల షేర్లు భారీగా పెరిగాయి. తక్కువ ధరకు లభించే కొన్ని రకాల షేర్లు మల్టీ బ్యాగర్‌గా అవతరించాయి. లాయిడ్స్‌ స్టీల్స్‌ ఇండస్ట్రీస్‌ కూడా ఇదే కోవలోకి వస్తుంది. 2021లో ఈ సాక్ట్‌ భారీ లాభాలను పంచిపెట్టింది. ఇన్వెస్టర్ల సంపదను వృద్ధి చేసింది. అర్ధ రూపాయి నుంచి రూ.24.95కు చేరుకుంది. రెండేళ్ల కాలంలో దాదాపుగా 4900 శాతం ర్యాలీ అయింది.


గతవారం ఈ స్టాక్‌ ధర రూ.20.65 నుంచి రూ.24.95కు చేరుకుంది. ఇన్వెస్టర్లకు 21 శాతం రాబడి ఇచ్చింది. ఇక చివరి నెలలో దాదాపుగా 130 శాతం పెరిగింది. రూ.10.80 నుంచి రూ.24.95కు చేరుకుంది. ఇక చివరి ఆరు నెలల్లో రూ.3.45 నుంచి రూ.24.95 వరకు పెరిగింది. 625 శాతం రాబడి ఇచ్చింది. అలాగే చివరి ఏడాదిలో ఒక రూపాయి నుంచి రూ.24.95కు పెరిగింది. దాదాపుగా 2400 శాతం ర్యాలీ చేసింది. గత రెండేళ్లలో అర్ధ రూపాయి నుంచి రూ.24.95కు పెరిగింది. 4900 శాతం ఎగిసింది.


లాయిడ్స్‌ స్టీల్‌ ఇండస్ట్రీస్‌లో ఒక వారం క్రితం లక్ష రూపాయిలు పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు రూ.1.21 లక్షల కోట్లుగా మారేంది. అదే ఒక నెల క్రితం లక్ష పెట్టుంటే ఇప్పుడు రూ.2.30 లక్షలు అందేవి. ఆరు నెలల క్రితం ఈ కంపెనీలో రూ.లక్ష ఇన్వెస్ట్‌ చేసుంటే ఇప్పుడు రూ.7.25 లక్షలుగా మారేవి. అలాగే ఏడాది క్రితం లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు రూ.25 లక్షలు చేతికి వచ్చేవి. రెండేళ్ల క్రితం అర్ధరూపాయి ఉన్నప్పుడు లక్ష ఇన్వెస్ట్‌ చేసుంటే ఇప్పుడు రూ.50 లక్షలు వచ్చేవి.


నోట్‌: స్టాక్‌ మార్కెట్లు, మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి నష్టభయంతో కూడుకున్నది! ఇది కేవలం సమాచారం కోసమే అందిస్తున్నాం. ఫలానా స్టాక్‌, ఫండ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. మార్కెట్లో పెట్టుబడులు పెట్టేముందు అన్ని విషయాలు పరిశీలించుకొని, విశ్లేషించుకోవాలి. అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవాలి!


Also Read: Crypto Credit Cards: మార్కెట్లో క్రిప్టో క్రెడిట్‌ కార్డులు! బ్యాంకు కార్డులకు వీటికి తేడా ఏంటో తెలుసా?


Also Read: PNB Service Charges: కస్టమర్లకు పీఎన్‌బీ షాక్‌! సర్వీస్‌ ఛార్జెస్‌ పెంచేసిన పంజాబ్‌ బ్యాంక్‌


Also Read: DMart Q3 results: డీమార్ట్‌ అదుర్స్‌! భారీ లాభాలు ఆర్జించిన అవెన్యూ సూపర్‌మార్ట్స్‌


Also Read: Satya Nadella: Growwలో పెట్టుబడి పెట్టిన Microsoft సీఈవో సత్య నాదెళ్ల


Also Read: Nellore Food: నెల్లూరులో నయా ట్రెండ్.. ఈ హాట్ చిక్ టేస్ట్ చేస్తే మైమరచిపోవాల్సిందే.. వంట కూడా స్కూటర్ మీదే..


Also Read: PAN-Aadhaar Linking: పాన్‌తో ఆధార్‌ లింక్‌ చేయలేదా? పదివేల ఫైన్‌ తప్పదు మరి!!