మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఓ ఫిన్‌టెక్ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రో (Groww) స్టార్టప్‌లో ఆయన ఇన్వెస్టర్, సలహాదారుగా మారారు. గ్రో సీఈవో లలిత్ కేశ్రీ సోషల్ మీడియా ద్వారా ఈ విషయం వెల్లడించారు.
'ప్రపంచంలోని అత్యుత్తమ సీఈవోల్లో ఒకరు గ్రో కంపెనీకి పెట్టుబడిదారు, సలహాదారుగా దొరికారు. భారత్‌లో ఆర్థిక సేవలను సులభతరం చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్న మా సంకల్పానికి సత్య నాదెళ్ల తోడైనందుకు సంతోషంగా ఉంది' అని లలిత్ ట్వీట్ చేశారు. అయితే సత్యనాదెళ్ల ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టారన్న వివరాలను మాత్రం బయటకు వెల్లడించలేదు.
వెల్త్ మేనేజ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్, స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్, మ్యూచువల్ ఫండ్ సేవలను గ్రో అందిస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో సిరీస్ డి రౌండ్ ద్వారా 83 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించింది. ఆ తర్వాత అక్టోబర్లో సిరీస్ ఈ ఫండింగ్ ద్వారా 251 మిలియన్ డాలర్లు సేకరించింది. దాంతో గ్రో విలువ 3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇదే సందర్భంలో యూనికార్న్‌గా అవతరించింది.
2016లో స్థాపించిన ఈ కంపెనీ జెరోదా, పేటీఎం మనీ, అప్‌స్టాక్స్ వంటి స్టాక్‌బ్రోకింగ్ వేదికలతో పోటీ పడుతోంది. ఇప్పటికే 20 లక్షల మంది యాక్టివ్ ఇన్వెస్టర్లకు తాము సేవలు అందిస్తున్నామని గ్రో తెలిపింది. మొత్తంగా యూజర్‌బేస్ రెండు రెండు కోట్లకుపైగా ఉందని వెల్లడించింది.
Also Read: PAN-Aadhaar Linking: పాన్‌తో ఆధార్ లింక్ చేయలేదా? పదివేల ఫైన్ తప్పదు మరి!!