పంజాబ్ నేషనల్ బ్యాంక్ వినియోగదారులకు షాకిచ్చింది! జనవరి 15 నుంచి కొన్ని రకాల సేవలకు రుసుములను పెంచింది. ఈ మేరకు వెబ్‌సైట్లో సేవా రుసుముల వివరాలను పోస్ట్ చేసింది.
ఇక మీదట మెట్రో ప్రాంతాల్లో మూడు నెలల సగటు నిల్వ (క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్)ను రూ.5000 నుంచి రూ.10000కు పెంచింది. ఒకవేళ గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఈ నిల్వను మెయింటేన్ చేయకపోతే వేసే పెనాల్టీని రూ.200 నుంచి రూ.400కు పెంచింది. మెట్రో, నగర ప్రాంతాల్లో ఈ రుసుమును రూ.300 నుంచి రూ.600కు పెంచింది. వీటిని మూడు నెలలకు ఒకసారి వసూలు చేస్తారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ పీఎన్‌బీ లాకర్ చార్జీలను పెంచేసింది. ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్ సైజును మినహాయిస్తే అన్ని రకాల లాకర్ ఛార్జీలను రూ.500కు పెంచింది. గతంలో ఏడాది 15 సార్లు ఉచితంగా లాకర్లను సందర్శించే అవకాశం ఉండేది. ఇప్పుడు వాటిని 12కు తగ్గించింది.
ఆ తర్వాత ఒక్కో విజిట్‌కు రూ.100 వసూలు చేస్తారు. ఖాతా తెరిచిన 12 నెలల ముందే కరెంట్ అకౌంట్ క్లోజ్ చేస్తే వసే రుసుమును రూ.600 నుంచి రూ.800కు పెంచారు. ఏడాది తర్వాత క్లోజ్ చేస్తే ఉచితమే. ఇక ఫిబ్రవరి 1 నుంచి ప్రతి లావాదేవీకి NACH డెబిట్ రుసుము రూ.100 నుంచి రూ.250కి పెంచారు.
Also Read: PAN-Aadhaar Linking: పాన్‌తో ఆధార్ లింక్ చేయలేదా? పదివేల ఫైన్ తప్పదు మరి!!