అగ్ర నటులు, నిర్మాత, విద్యావేత్త మోహన్ బాబు నేడు ఓ కీలక ప్రకటన చేశారు. తన పేరు మీద తిరుపతిలో యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. శ్రీవిద్యానికేతన్ పేరుతో ఎంతోమందికి ఆయన విద్యను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి... యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.


"నా తల్లితండ్రులు, అభిమానులు, శ్రేయోభిలాషుల ఆశీర్వాదంతో... మోహన్ బాబు యూనివర్సిటీ ప్రకటించడం గౌరవంగా భావిస్తున్నాను. శ్రీ విద్యానికేతన్ లో నాటిన విత్తనాలు నేడు కల్పవృక్షంగా ఎదిగాయి. మీ 30 ఏళ్ల నమ్మకం, నా జీవితం లక్ష్యం కలగలిపి ఇన్నోవేటివ్ లెర్నింగ్ యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. తిరుపతిలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. మీ ప్రేమే నా బలం. ఈ స్వప్నం సాకారం అవ్వడంలోనూ మీ ప్రేమ ఇలాగే ఉంటుందనే విశ్వాసం నాకు ఉంది" అని మోహన్ బాబు పేర్కొన్నారు.





కుల, మత, ప్రాంతాలకు అతీతంగా శ్రీ విద్యానికేతన్ కాలేజీలో 25 శాతం మంది పేద విద్యార్థులకు చదువుకునే అవకాశాన్ని మోహన్ బాబు కల్పిస్తున్నారు. ఇప్పుడు ఈ మోహన్ బాబు యూనివర్సిటీలోనూ అదే విధంగా అడ్మిషన్స్ ఉంటాయని ఆశించవచ్చు. ఈ యూనివర్సిటీ విషయాన్ని ప్రకటించిన వెంటనే మోహన్ బాబుకు పలువురు శుభాకాంక్షలు చెప్పారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ ట్రెండింగ్ అవుతోంది.


Also Read: మెగా మేనల్లుడి మాస్ ట్రీట్‌కు రెడీనా?
Also Read: ఏపీ సీయం జ‌గ‌న్‌తో చిరంజీవి భేటీ... టికెట్ రేట్స్ గురించి చ‌ర్చిస్తారా?
Also Read: ఏపీలో టికెట్ రేట్స్ పెరిగితే మాకు బోనస్! టికెట్ రేట్స్ తగ్గించిన తర్వాతే... - నాగచైతన్య ఇంటర్వ్యూ
Also Read: బలిసికొట్టుకుంటోంది మీరే.. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేపై మండిపడిన నిర్మాత !
Also Read: త్రివిక్ర‌మ్ గారూ... ఆ సీన్ యూట్యూబ్‌లో రిలీజ్ చేయండి!
Also Read: అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..? టికెట్ రేట్ ఇష్యూపై బాలయ్య వ్యాఖ్యలు..
Also Read: థియేటర్ల కోసం సినిమాలు దాచాల్సిన అవసరం నాకు లేదు! వాళ్లు హ్యాపీగా ఉండాలనే... - నాని ఇంటర్వ్యూ
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి