'ఉప్పెన' సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయిన మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతో భారీ విజయం అందుకున్నారు. ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'కొండపొలం' చేశారు. ఇప్పుడు గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన హీరోగా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు ఓ సినిమా తెరకెక్కించనున్నాయి. ఈ రోజు వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు.


పంజా వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా 'సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌' సూర్యదేవర నాగవంశీ, 'ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్' సాయి సౌజన్య నిర్మాతలుగా ఈ సినిమా రూపొందనుంది. ఇది మాస్ ఎంటర్టైనర్ అని సమాచారం. పంజా వైష్ణవ్ తేజ్ నుంచి మాస్ ట్రీట్ అంటూ నిర్మాణ సంస్థలు పేర్కొన్నాయి. "ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ అసోసియేషన్ తో మా సంస్థలో ప్రొడక్షన్ నంబర్ 16 అనౌన్స్ చేయడం సంతోషంగా ఉంది" అని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పేర్కొంది. పంజా వైష్ణవ్ తేజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.









అన్నట్టు... పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పవన్ సినిమా విడుదలకు ముందే ఆయన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా సినిమా ప్రకటించారు.


Also Read: ఏపీ సీయం జ‌గ‌న్‌తో చిరంజీవి భేటీ... టికెట్ రేట్స్ గురించి చ‌ర్చిస్తారా?
Also Read: ఏపీలో టికెట్ రేట్స్ పెరిగితే మాకు బోనస్! టికెట్ రేట్స్ తగ్గించిన తర్వాతే... - నాగచైతన్య ఇంటర్వ్యూ
Also Read: బలిసికొట్టుకుంటోంది మీరే.. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేపై మండిపడిన నిర్మాత !
Also Read: త్రివిక్ర‌మ్ గారూ... ఆ సీన్ యూట్యూబ్‌లో రిలీజ్ చేయండి!
Also Read: అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..? టికెట్ రేట్ ఇష్యూపై బాలయ్య వ్యాఖ్యలు..
Also Read: థియేటర్ల కోసం సినిమాలు దాచాల్సిన అవసరం నాకు లేదు! వాళ్లు హ్యాపీగా ఉండాలనే... - నాని ఇంటర్వ్యూ
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి