పన్ను చెల్లింపు దారులకు గుడ్‌న్యూస్‌! ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే గడువును ప్రభుత్వం పొడగించింది. 2021, డిసెంబర్‌ 31తో ముగిసిన గడువును 2022, మార్చి 15 వరకు పొడగించింది. ఇప్పటి వరకు ఐటీఆర్‌ సమర్పించని వాళ్లు ఇకపై ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ మేరకు ఆదాయపన్ను శాఖ ఓ ట్వీట్‌ చేసింది.







'కొవిడ్‌-19 మహమ్మారి, ఇతర ఇబ్బందులతో ఐటీ రిటర్నులు దాఖలు చేయలేకపోయామని చాలామంది పన్ను చెల్లింపుదారులు పేర్కొన్నారు. వారి విజ్ఞప్తి మేరకు ఆడిట్‌ రిపోర్టులు, ఐటీఆర్‌ అసెస్‌మెంట్‌ ఇయర్‌ 21-22 దాఖలు గడువును మరింత పొడగిస్తున్నాం' అని ప్రభుత్వం తెలిపింది. 'అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2021-22 ఐటీఆర్‌ దాఖలు తేదీని 2021, నవంబర్ 30కి, దానిని 2021, డిసెంబర్‌ 31కి, అట్నుంచి 2022 ఫిబ్రవరి 28కి దానిని 2022, మార్చి 15కు పొడగిస్తున్నాం' అని ఉత్తర్వులు జారీ చేసింది.






2021, ఏప్రిల్‌ 1 నుంచి 2022, జనవరి 3 వరకు 1.48 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రత్యక్ష్య పన్నుల శాఖ (సీబీడీటీ) రూ.1,50,407 కోట్లకు పైగా రీఫండ్స్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.  ఇందులో 1.46 కోట్ల మందికి రూ.51,194 కోట్లు ఇన్‌కం టాక్స్‌ రీఫండ్స్‌ జారీ చేయగా 2.19 లక్షల మందికి కార్పొరేట్‌ టాక్స్‌ రీఫండ్‌ రూపంలో రూ.99,213 కోట్లు రీఫండ్‌ చేసింది.


Also Read: Multibagger stock: పెన్నీ స్టాక్‌.. 2 ఏళ్లు.. లక్ష పెట్టుబడి.. రూ.50 లక్షలు ప్రాఫిట్‌!


Also Read: CCD New CEO Malavika Hegde: భర్త విధికి తలవంచితే.. ఆమె ఎదిరించి నిలబడింది.. ఓ మంచి కాఫీ లాంటి కథ!


Also Read: PNB Service Charges: కస్టమర్లకు పీఎన్‌బీ షాక్‌! సర్వీస్‌ ఛార్జెస్‌ పెంచేసిన పంజాబ్‌ బ్యాంక్‌


Also Read: Reliance Mandarin Hotel Deal: అమెరికాలో ఫైవ్‌స్టార్‌ హోటల్‌ కొనుగోలు చేసిన రిలయన్స్‌.. ఎంతకో తెలుసా?


Also Read: Anand Mahindra: మహీంద్రా కాకుండా వేరే కార్లున్నాయా? ఆనంద్‌ మహీంద్రా ఆశ్చర్యం!!