Anand Mahindra: 'మహీంద్రా కాకుండా వేరే కార్లున్నాయా? నాకు తెలియదే!' అని అంటున్నారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా. సోషల్‌ మీడియాలో ఆయన యాక్టివ్‌ ఉండే సంగతి తెలిసిందే. తాజాగా ట్విటర్లో ఆయన ఓ సరదా సంభాషణకు దిగారు.


గ్రీన్‌ బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రెసిడెంట్‌ ఎరిక్‌ సోలిమ్‌ తమిళనాడుకు చెందిన ఓ చిత్రాన్ని మొదట ట్వీట్‌ చేశారు. ఇది నమ్మక్కల్‌లోని కొల్లి రోడ్‌. ఇదో పర్వత ప్రాంతం. కొండపైన 70 మలుపులతో ఈ రహదారి ఉంది. దీనిపై ప్రయాణం చేయాలంటే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం.  'అద్భుతమైన భారతదేశం!  70 మలుపులతో కూడిన ఘాట్‌రోడ్డు. ప్రయాణం చేయాలంటే ధైర్యం ఉండాల్సిందే' అని ఎరిక్ ట్వీట్‌ చేశారు. దీనికి ఆనంద్‌ మహీంద్రా స్పందించారు.






'ఎరిక్‌.. మీరెప్పుడూ మా సొంత దేశం గురించి మాకెంత తక్కువ తెలుసో నాకు చూపిస్తూనే ఉంటారు! ఇది నిజంగా అద్భుతం. ఈ రహదారిని ఎవరు నిర్మించారో నేను కనుక్కోవాలి. ఆ తర్వాత దీనిపై ప్రయాణించేందుకు నేను థార్‌ (వాహనం)పై మాత్రమే నమ్మకం ఉంచుతాను' అని మహీంద్రా ట్వీట్‌ చేశారు.


వెంటనే కరన్‌ అనే నెటిజన్ 'నేను రోడ్డుకు సమీపంలోనే ఉన్నాను మహీంద్రా. మీకు అవసరమైతే నా థార్‌లో మీకు లిఫ్ట్‌ ఇస్తా' అని స్పందించారు. దానికి మహీంద్రా 'డీల్‌' అంటూ అంగీకరించారు.


'ఈ ఘాట్‌ రోడ్డులోనే నేను నా థార్‌ (2015 మోడల్‌)ను నడిపాను. ఇలాంటి పర్వత రహదారుల కోసమే థార్‌ను తయారు చేసినట్టుంది. అలవోకగా ఎక్కేసింది. నేను కాల్‌హట్టి ఘాట్‌ నుంచి ఊటీ వరకు ఇందులో ప్రయాణించాను. ఏదేమైనా థార్‌ ఇలాంటి మలుపులను చాలా ఇష్టపడుతుంది' అని వెంకటేశ్వరన్‌ ట్వీట్‌ చేశారు. దానిని ఆనంద్‌ మహీంద్రా రీట్వీట్‌ చేశారు. 






ఇక అక్షిత్‌ సోని అనే వ్యక్తి 'సర్‌.. మహీంద్రా కాకుండా మీరింకేమైనా కార్లు నడిపారా?' అని ప్రశ్నించగా.. 'అంటే.. మహీంద్రా కాకుండా ఇంకేమైనా కార్లు ఉన్నయనా నీ మాటల అర్థం? నాకైతే తెలియదు (సరదాగా అన్నాను)' అని ఆనంద్‌ మహీంద్రా అతడికి బదులిచ్చారు.


Also Read: Crypto Credit Cards: మార్కెట్లో క్రిప్టో క్రెడిట్‌ కార్డులు! బ్యాంకు కార్డులకు వీటికి తేడా ఏంటో తెలుసా?


Also Read: PNB Service Charges: కస్టమర్లకు పీఎన్‌బీ షాక్‌! సర్వీస్‌ ఛార్జెస్‌ పెంచేసిన పంజాబ్‌ బ్యాంక్‌


Also Read: DMart Q3 results: డీమార్ట్‌ అదుర్స్‌! భారీ లాభాలు ఆర్జించిన అవెన్యూ సూపర్‌మార్ట్స్‌