కరోనా కాలంలో కార్మికుల పాలిట వరంలా సోనూ సూద్ అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అప్పటి వరకూ సినిమాల్లో విలన్, ఇతరత్రా రోల్స్ చేయడం ద్వారా ఆయనకు ప్రేక్షకుల్లో గుర్తింపు వచ్చింది. అయితే... కరోనా కాలంలో ఆయనకు గౌరవం వచ్చింది. సోనూ సూద్‌ను మెస్సయ్యగా అభివర్ణించారు కొందరు. పంజాబ్ రాష్ట్రం అతడిని పిలిచి మరీ స్టేట్ ఐకాన్ పదవి కట్టబెట్టింది. అయితే... ఆయన సోదరి మాళవిక రాజకీయాల్లోకి రావడంతో పరిస్థితులు మారాయి. సోనూ సూద్ తన పదవిని వదులుకున్నారు.
రాజకీయాల్లోకి రావడం కోసమే సోనూ సూద్ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని విమర్శించే వ్యక్తులు, సోనూ సోదరి రావడంతో తమ విమర్శలకు మరింత పదును పెంచేశారు. విమర్శలను పట్టించుకోకుండా సోనూ సూద్ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సోషల్ మీడియాలో చేసిన లేటెస్ట్ పోస్ట్ విమర్శలకు చెక్ పెట్టేలా ఉంది.
"నా సోదరి మాళవిక తన రాజకీయ ప్రయాణం ప్రారంభించిన సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నాను. ఆమె జీవితంలో ఈ నూతన అధ్యాయం వికసించాలని కోరుకుంటున్నాను" అని సోనూ సూద్ పేర్కొన్నారు. ఆ తర్వాత "రాజకీయాలకు అతీతంగా.... నటుడిగా, మానవతావాదిగా నా పనులు కొనసాగిస్తా" అని చెప్పారు. అదీ సంగతి! సోనూ సూద్ సోదరి మాళవిక కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అధికార ప్రభుత్వాల నుంచి ఆయన విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆల్రెడీ ఓసారి సోనూను టార్గెట్ చేశారని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
Also Read: సిద్ధార్థ్ దేశానికి ఏం చేశాడు? కన్నీళ్లు పెట్టుకున్న సైనా నెహ్వాల్ తండ్రిAlso Read: పీరియడ్స్‌పై ఇలియానా షాకింగ్ కామెంట్స్Also Read: పవన్ కల్యాణ్ 'హరి హర వీర మల్లు' లేటెస్ట్ అప్‌డేట్...Also Read: పవన్ కల్యాణ్‌తో వన్స్‌మోర్ ప్లీజ్... - నిధి అగర్వాల్ ఇంటర్వ్యూAlso Read: రేణుదేశాయ్, అకీరా నందన్ కు కోవిడ్ పాజిటివ్..Also Read: ఐసీయూలో లతా మంగేష్కర్... కరోనాతో ఆస్పత్రిలో చేరికఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి