Chris Morris Retirement: దక్షిణాఫ్రికా క్రికెటర్ క్రిస్ మోరిస్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సఫారీ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశాడు. మంగళవారం నాడు తన నిర్ణయాన్ని వెల్లడించాడు మోరిస్. దక్షిణాఫ్రికాకు అన్ని ఫార్మాట్లలో కలిపి 69 మ్యాచ్ లలో ప్రాతినిథ్యం వహించిన మోరిస్ తన క్రీడా జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. త్వరలోనే కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నట్లు తెలిపాడు.
దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ఎంపికైన కొన్ని రోజుల్లోనే కీలక పేసర్‌గా, ఆల్ రౌండర్‌గా మారాడు క్రిస్ మోరిస్. వన్డేల్లో చివరగా 2019లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడాడు. అనంతరం టీ20 లీగ్స్, ఇతర ఫ్రాంచైలలకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. డొమోస్టిక్ క్రికెట్‌లో టైటాన్ జట్టుకు తదుపరి కోచ్‌గా త్వరలో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
రిటైర్మెంట్ ప్రకటన అనంతరం క్రిస్ మోరిస్ మాట్లాడుతూ.. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నాను. పూర్తి స్తాయిలో రిటైర్మెంట్ నిర్ణయం అమలులోకి వస్తుంది. నా కెరీర్‌లో ఇంత వరకు మద్ధతు తెలిపిన, సహకరించిన అందరికీ ధన్యావాదాలు. కెరీర్ సుదీర్ఘమా, కొంత కాలమా అనే పట్టింపులు లేకుండా సహకారం అందించిన వారికి థ్యాంక్స్. కొత్త ఇన్నింగ్స్ త్వరలోనే మొదలుపెడతాను. డొమెస్టిక్ టీమ్ టైటాన్స్‌కు కోచ్‌గా కొత్త బాధ్యతలు చేపడతానంటూ’ పలు విషయాలు షేర్ చేసుకున్నాడు.
కెరీర్‌లో ఈ సఫారీ ఆల్ రౌండర్ 4 టెస్టులు, 42 వన్డేలు, 23 టీ20లలో దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. బంతితో 94 వికెట్లు పడగొట్టగా, బ్యాటింగ్‌లో 773 పరుగులు సాధించాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 196, లిస్ట్ ఏ మ్యాచ్‌లో 126, టీ20లలో 290 వికెట్లు తీశాడు. 34 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ప్రకటించాడు.
Also Read: నాలుగు గంటల భేటీ మధ్యలో రొయ్యల బిర్యానీ లంచ్ ! చివరికి ఏమి తేల్చారంటే ?
Also Read: Gold-Silver Price: గుడ్‌న్యూస్! నేడు మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. మీ ప్రాంతంలో తాజా ధరలు ఇవీ..