Just In





RGV Tickets Issue : టిక్కెట్ల ఇష్యూలో ' బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' అనే ప్రశ్న వస్తుందన్న ఆర్జీవీ ! దీని అర్థం ఏమిటి ?
" బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?" అనే డౌట్ ఏపీ సినిమా టిక్కెట్ ఇష్యూలో వస్తోందని వర్మ ట్వీట్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో లేని విధానం ఏపీలోనే ఎందుకన్న కోణంలో ఆయనీ ట్వీట్ చేశారు.
సినిమా టిక్కెట్ల ధరల విషయాన్ని రామ్‌గోపాల్ వర్మ ఇంతటితో వదిలి పెట్టాలని అనుకోవడం లేదు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని కలిసిన తరవతా హైదరాబాద్ వచ్చి మీడియా చానళ్లకు వెళ్లి డిస్కషన్స్‌లో తాను ఎప్పుడూ చెప్పే వాదననే వినిపించిన ఆయన.. మళ్లీ ఉదయం నుంచే ట్వీట్లు ప్రారంభించారు. టిక్కెట్ రేట్ల ఖరారుకు నియమించిన కమిటీ అమరావతిలో సమావేశమవుతున్న సమయంలో ఆయన ఇతర రాష్ట్రాల్లో టిక్కెట్ రేట్ల గురించి వివరిస్తూ ట్వీట్ చేశారు.
Also Read: నాలుగు గంటల భేటీ మధ్యలో రొయ్యల బిర్యానీ లంచ్ ! చివరికి ఏమి తేల్చారంటే ?
ఉత్తరాది రాష్ట్రాల్లో ఐనాక్స్ మల్టీప్లెక్స్‌లలో రూ.2,200 వరకు టికెట్లు విక్రయిస్తున్నారని ఆర్జీవీ ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో "ఆర్‌ఆర్‌ఆర్" టికెట్ల ధర రూ.2,200 వరకు అనుమతించారు. కానీ రాజమౌళి సొంత రాష్ట్రం ఏపీలో మాత్రం రూ.200కు అమ్ముకోవడానికి అనుమతుల్లేవు. ఇలాంటప్పుడే "బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే" ప్రశ్న ఉత్పన్నమవుతోందని సెటైరిక్‌గా ట్వీట్ చేశారు.
Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?
తాము అన్నీ చట్ట ప్రకారమే చేస్తున్నామని ఆర్జీవీతో మీటింగ్ తర్వాత పేర్ని నాని వ్యాఖ్యానించారు. టిక్కెట్ దరల విషయంలో తాము చెప్పాల్సింది ఆర్జీవీకి చెప్పామన్నారు. ఆర్జీవీ కూడా తన వెర్షన్ తాను వినిపించానన్నారు. మీటింగ్‌లో ఇద్దరూ ఎవరి అభిప్రాయాలతో ఎవరూ ఏకీభవించలేదని తాజా పరిణామాలతో తేలిపోయింది.
Also Read: టిక్కెట్ల వివాదం ముదరదు.. త్వరలోనే పరిష్కారం : సజ్జల