బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మీద హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అయన ఉపయోగించిన భాష, పదం అభ్యంతరకరంగా ఉందని చాలా మంది పేర్కొంటున్నారు. సైనాకు మద్దతుగా, సిద్ధార్థ్‌కు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలు చెబుతున్నారు. తాను చేసిన ట్వీట్‌లో డబల్ మీనింగ్ లేదని సిద్ధార్థ్ వివరణ ఇచ్చినప్పటికీ... వేడి చల్లారలేదు. సైనా నెహ్వాల్ తండ్రి సైతం సిద్ధార్థ్ మీద మండిపడ్డారు.
"బాడ్మింటన్ కోర్టులో నా కుమార్తె దేశానికి చాలా మెడల్స్ అందించింది. మరి, ఈ దేశానికి సిద్ధార్థ్ ఏం చేశాడు?" అని సైనా నెహ్వాల్ తండ్రి హర్వీర్ సింగ్ నెహ్వాల్ ప్రశ్నించారు. సిద్ధార్థ్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్ధార్థ్ అటువంటి పదాలు ఉపయోగించడం బాలేదని స్పష్టంగా చెప్పారు. ఓ దశలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. ఓ జాతీయ ఛానల్‌తో టెలిఫోన్‌లో హర్వీర్ సింగ్ మాట్లాడినప్పుడు చోటు చేసుకున్న సందర్భం ఇది.
Also Read: "కాక్" రేపుతున్న సైనా నెహ్వాల్‌పై సిద్ధార్థ్ ట్వీట్.. జాతీయ మహిళా కమిషన్ సీరియస్ .. సింగిల్ మీనింగేనని హీరో వివరణ..!
సిద్ధార్థ్ ఖాతాను బ్లాక్ చేయాలని ట్విట్టర్‌కు లేఖ రాయడంతో పాటు అతనిపై కేసు నమోదు చేయాలని మహారాష్ట్ర పోలీసులను ఆదేశించిన జాతీయ మహిళా కమీషన్ నిర్ణయాన్ని హర్వీర్ సింగ్ నెహ్వాల్ స్వాగతించారు. సైనాకు మద్దతుగా జాతీయ మహిళా కమీషన్‌తో పాటు గాయని చిన్మయి, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ తదితర ప్రముఖులతో పాటు ఎంతో నెటిజన్స్ ట్వీట్లు చేస్తున్నారు.
Also Read: పీరియడ్స్‌పై ఇలియానా షాకింగ్ కామెంట్స్
Also Read: పవన్ కల్యాణ్ 'హరి హర వీర మల్లు' లేటెస్ట్ అప్‌డేట్...
Also Read: పవన్ కల్యాణ్‌తో వన్స్‌మోర్ ప్లీజ్... - నిధి అగర్వాల్ ఇంటర్వ్యూ
Also Read: రేణుదేశాయ్, అకీరా నందన్ కు కోవిడ్ పాజిటివ్..
Also Read: ఐసీయూలో లతా మంగేష్కర్... కరోనాతో ఆస్పత్రిలో చేరిక
Also Read: ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో బాలకృష్ణ కుమార్తె ఫస్ట్ స్టెప్... 'అన్‌స్టాపబుల్' సక్సెస్ స్టెప్
Also Read: 'జబర్దస్త్' నుంచి అభి అవుట్... 'హైపర్' ఆది కామెంట్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి