'చరిత్ర సృష్టించాలన్నా మేమే... దాన్ని తిరగ రాయాలన్నా మేమే' - నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా 'సింహా'లో ఆయన చెప్పిన డైలాగ్ ఇది. ఇప్పుడు 'అన్‌స్టాపబుల్' టాక్ షోకి ఈ డైలాగ్ కరెక్టుగా సరిపోతుంది. ఓటీటీలో బాలకృష్ణ మామూలు ఎంట్రీ ఇవ్వలేదు. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చారు. ఆహా ఓటీటీ కోసం ఆయన చేస్తున్న 'అన్‌స్టాపబుల్' టాక్ షో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. టాక్ షోస్ అందు 'అన్‌స్టాపబుల్' టాక్ షో వేరు అన్నట్టు రికార్డులు నెలకొల్పింది. ఈ సక్సెస్ వెనుక బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని కూడా ఉన్నారు.
అవును... బాలకృష్ణ కుమార్తె తేజస్విని 'అన్‌స్టాపబుల్' టాక్ షోకు క్రియేటివ్ కన్సల్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హెరిటేజ్ సంస్థల నిర్వహణలో బాలకృష్ణ పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి ఎంత విజయవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నదీ ప్రజలే ప్రత్యక్షంగా చూస్తున్నారు. బ్రాహ్మణి ఎప్పుడూ, ఎక్కడా ఎక్కువగా మాట్లాడింది లేదు. చేతలతో తన ప్రతిభ చూపించారు. సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ వెళతారు. ఇప్పుడు బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని కూడా అదే బాటలో నడుస్తున్నారు. సైలెంట్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
'అన్‌స్టాపబుల్' టాక్ షోకు తేజస్విని క్రియేటివ్ కన్సల్టెంట్ అయినప్పటికీ... ఆమె గురించి బాలకృష్ణ కూడా షోలో గానీ, బయట గానీ చెప్పలేదు. అసలు... ఇప్పటి వరకూ బాలకృష్ణ కుమార్తెకు ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్నట్టు కూడా ఎవరికీ తెలియదు. సైలెంట్‌గా వచ్చిన తేజస్విని తొలి స్టెప్‌లోనే... సక్సెస్ ఫుల్ అయ్యారు. 'అన్‌స్టాపబుల్' షో గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ బాలకృష్ణ లుక్, ఆయన స్టైల్, స్పాంటేనియస్‌గా ఆయన వేసే పంచ్ డైలాగ్స్ గురించి మాట్లాడుతున్నారు. దీని వెనుక ఉన్న క్రియేటివ్ మైండ్స్‌లో తేజస్విని కూడా ఒకరు అన్నమాట. అదీ సంగతి!
Also Read: పీరియడ్స్‌పై ఇలియానా షాకింగ్ కామెంట్స్
Also Read: ఆమె ఆవేదన అక్షర రూపంలో... అయిదేళ్ల మౌనం తరువాత తొలిసారి స్పందించిన భావన
Also Read: 'జబర్దస్త్' నుంచి అభి అవుట్... 'హైపర్' ఆది కామెంట్!
Also Read: జనవరి 11 ఎపిసోడ్: ప్రేమని అక్షరాలుగా మలిచిన రిషి, చాలా బాగా రాశారన్న వసు... గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్..
Also Read: సినిమాలోనూ తండ్రీ కూతుళ్లుగా... అందరూ వద్దన్నా సరే!
Also Read: నువ్వు రౌడీ అయితే నేను రౌడీ ఇన్‌స్పెక్టర్.. అన్నీ చేశాకే ఇక్కడొచ్చి కూర్చున్నాం.. అన్‌స్టాపబుల్ కొత్త ప్రోమో వచ్చేసింది!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి