రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'శేఖర్'కు ఓ స్పెషాలిటీ ఉంది. అందులో ఆయన పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ కూడా నటించారు. రాజ‌శేఖ‌ర్‌కు కుమార్తె పాత్రలోనే! నిజ జీవితంలో తండ్రీ కూతుళ్లు అయిన వీళ్లిద్దరూ వెండితెరపై కూడా తండ్రీ కూతుళ్లుగా కనిపించనున్నారు. అయితే... శివాని రోల్ పెద్దది ఏమీ కాదు. జస్ట్, ఓ పది రోజులు ఆమె షూటింగ్ చేశారు.


స్క్రీన్ స్పేస్ (నిడివి) తక్కువ కాబట్టి 'శేఖర్'లో ఆ రోల్ చేయవద్దని తనకు కొంత మంది సలహా ఇచ్చారని, దాని గురించి చాలా ఆలోచించానని శివానీ రాజశేఖర్ తెలిపారు. తాను నటించడం వల్ల ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని ఓకే చేసినట్టు చెప్పుకొచ్చారు. రాజ‌శేఖ‌ర్ గారు, శివాని రియ‌ల్ లైఫ్‌లో తండ్రీ కూతుళ్లు కాబ‌ట్టి... స్క్రీన్ మీద కూడా తండ్రీ కూతుళ్లుగా క‌నిపిస్తే ఆడియ‌న్స్‌కు క‌న్వీన్స్ చేయ‌డం ఈజీగా ఉంటుంద‌ని తీసుకున్న సమష్టి నిర్ణయం ఇదని జీవితా రాజశేఖర్ అన్నారు. సినిమాకు ఆవిడ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.


'శేఖర్'... హీరోగా రాజశేఖర్ 91వ సినిమా. సినిమాలో ఆయన పెద్ద కుమార్తె శివాని నటించారు. ఆయన భార్య జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్-ప్లే సమకూర్చారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆత్మీయ రజన్, 'జార్జ్ రెడ్డి' ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు.






Also Read: సుకుమార్ బ‌ర్త్‌డేను వైఫ్ ఎలా సెల‌బ్రేట్ చేసిందో చూశారా?
Also Read: సహజీవనం చేస్తున్న ఆ హీరోహీరోయిన్లు? వారిద్దరి మధ్య వయసు తేడా ఎంతంటే...
Also Read: ప్రభాస్ ని టెన్షన్ పెడుతోన్న 'బ్రహ్మాస్త్ర'.. అసలు కథేంటంటే..?
Also Read: సినిమా ఇండస్ట్రీను అవమానించారు.. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై నిర్మాతల మండలి సీరియస్..
Also Read: క్రేజీ డైరెక్టర్ మూవీతో హీరోగా ఫేస్ టర్నింగ్ ఇస్తున్న సింగర్ సిద్ శ్రీరామ్..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి