TFPC: సినిమా ఇండస్ట్రీను అవమానించారు.. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై నిర్మాతల మండలి సీరియస్.. 

టాలీవుడ్ ను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలుగు సినిమా నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది.

Continues below advertisement

టాలీవుడ్ ను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలుగు సినిమా నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది.

Continues below advertisement

''కోవూరు శాసన సభ్యులు శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు సినిమా నిర్మాతలనుద్దేశించి మాట్లాడుతూ 'మన సినిమా నిర్మాతలను బలిసినవాల్లు, అని' అనడం జరిగింది. ఇది చాలా బాధాకరం, నిజ నిజాలు తెలియకుండా ఒక గౌరవ శాసన సభ్యులు ఈ విధంగా మాట్లాడటం, మొత్తం తెలుగు సినిమా పరిశ్రమను అవమానించినట్టు గా భావిస్తున్నాము.

మన తెలుగు సినిమా సక్సెస్ రేటు సుమారుగా 2 నుండి 5% మాత్రమే మిగిలిన సినిమాలు నష్టపోవడం జరుగుతుంది. చిత్రసీమలో ఉన్న 24 కాప్స్ కు పని కల్పిస్తూ, అనేక ఇబ్బందులు పడి, కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీసిన నిర్మాతలు, చివరకు ఆస్తులు అమ్ముకోవడం జరుగుతుంది. ఈ కష్ట, నష్టాల బారిన పడి కొంతమంది నిర్మాతలు చలన చిత్ర నిర్మాతల మండలి నుండి నెలకు 3000/- రూపాయలు పెన్షన్ తీసుకోవడం. జరుగుతుంది.

దీనిని బట్టి చలన చిత్ర నిర్మాతలు ఎటువంటి దారుణ పరిస్థితులలో ఉన్నారన్న సంగతి తేట తెల్లమవుతుంది. గౌరవ సభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిర్మాతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేస్తూ వారి వ్యాఖలను ఉపసంహరించుకోవాలని కోరుచున్నాము'' అంటూ నిర్మాతల మండలి ఓ లేఖను విడుదల చేసింది. 

Also Read: మహేష్ మేనల్లుడి 'హీరో' సినిమా ట్రైలర్ చూశారా..?

 
 
Continues below advertisement