సినీ నటుడు సిద్ధార్థ్.. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. సైనా పెట్టిన పోస్ట్ పై రియాక్ట్ అవుతూ.. ఆమెపై అభ్యంతరకర పదజాలం వాడారు సిద్ధార్థ్. ఇటీవల పంజాబ్ లో జరిగిన ఘటన తరువాత.. దేశప్రధాని నరేంద్ర మోదీ భద్రతపై దేశవ్యాప్తంగా ప్రముఖులు ట్వీట్ చేశారు. బ్యాడ్మింటన్ ప్లేయర్, ఒలింపిక్ మెడలిస్ట్ సైనా నెహ్వాల్ కూడా మోడీ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ చేశారు. 


దీనికి రిప్లై ఇస్తూ.. హీరో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఆయన వాడిన పదాలు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ.. నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకీ సిద్ధార్థ్ తన ట్వీట్ లో ఏం రాశాడంటే.. 'సటిల్ కాక్ చాంపియన్ ఆఫ్ ది వరల్డ్.. మనల్ని రక్షించేవారు ఉన్నందుకు దేవుడికి ధన్యవాదాలు చెబుతున్నాను' అంటూ పోస్ట్ చేశారు. 


సాధారణంగా బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ను షెటిల్ కాక్ ప్లేయర్స్ అని అంటారు. కానీ సిద్ధార్థ్ కావాలనే వ్యంగ్యంగా సటిల్ కాక్ అని అన్నారు. 'Cock' అనే పదాన్ని మేల్ సెక్సువల్ ఆర్గాన్ కోసం వాడతారు. సిద్ధార్థ్ కావాలనే సైనా నెహ్వాల్ ను ఇన్సల్ట్ చేస్తూ డబుల్ మీనింగ్ లో మాట్లాడాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది చూసిన సింగర్ చిన్మయి కూడా ఘాటుగా స్పందించింది. 


'ఇది చాలా దారుణం.. మహిళలంతా దేనికైతే పోరాటం చేస్తున్నామో.. మళ్లీ ఇంకొంచెం పోరాడే విధంగా నీ వ్యాఖ్యలు ఉన్నాయంటూ' చిన్మయి మండిపడింది. అయితే సిద్ధార్థ్ మాత్రం తను డబుల్ మీనింగ్ తో మాట్లాడలేదని.. తన ట్వీట్ లో తప్పులు వెతికే ప్రయత్నం చేస్తే నేనేం చేయలేనని బదులిచ్చారు. 


కానీ నెటిజన్లు మాత్రం ఈ విషయంలో సిద్ధార్థ్ ను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నాడు. ఒక మహిళను కించపరుస్తూ ఇలాంటి సెక్సిస్ట్ కామెంట్స్ చేయడానికి సిగ్గులేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ట్విట్టర్ లో మహిళలను హెరాస్ చేస్తోన్న సిద్ధార్థ్ ను శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 










Also Read: దీప్తి బ్రేకప్ చెప్పినా.. షన్ను అదే పని, ఆ స్టాటస్ చూసిందో లేదో..


Also Read: శ్రీకాకుళం కథతో మెగాస్టార్ సినిమా.. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్..


Also Read: 'నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశా..' శాంతనుతో ఎఫైర్ పై శృతి కామెంట్స్..


Also Read: వేద పాత్రలో హృతిక్ ఇంటెన్స్ లుక్.. ఫ్యాన్స్ కు బర్త్ ట్రీట్..


Also Read: 'మీరెప్పటికీ మాతోనే ఉంటారు..' నమ్రత ఎమోషనల్ పోస్ట్..



 











ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి