నెలసరి (పీరియడ్స్) సమయంలో కొంత మంది మహిళలకు కడుపు నొప్పి, ఇంకొంత మందికి అధిక రక్తస్రావం, మరి కొందరికి నడుము నొప్పి, పొత్తి కడుపులో తీవ్ర పోటు... ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఆ మూడు రోజులు మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీటి గురించి ఇలియానా మాట్లాడారు. ఆ సమయంలో వర్కవుట్స్ చేస్తే నొప్పి తగ్గుతుందని కొంత మంది చెప్పారని, అలా చేయడం వల్ల అన్నిసార్లు సత్ఫాలితాలు రావని ఆమె అన్నారు.
"ఓకే... ఒక్క నిమిషం రియల్‌గా ఉందాం. పీరియడ్స్ రెండో రోజు ఎంత కష్టంగా ఉంటుందో చాలా మంది మహిళలకు తెలుసు. నడుము కింద భాగంలో నొప్పి, అధిక రక్తస్రావం, సంకోచాల వల్ల నొప్పి రెండింతలు అవ్వడం... సాధారణంగా వచ్చే అన్ని ఇబ్బందులను నేను అనుభవించాను. ఆ సమయంలో వ్యాయామాలు చెయ్యడం వల్ల ఎండోర్ఫిన్ విడుదల అవ్వడంతో కొంత ఉపయోగం ఉంటుందని నేను ఎక్కడో చదివాను. అది అన్నిసార్లు వర్కవుట్ అవ్వదు. మీ బాడీ చెప్పింది వినండి. ఒకవేళ అవసరం అనుకుంటే ఆ రోజు సెలవు తీసుకోండి. అందులో ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు" అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇలియానా పోస్ట్ చేశారు.
మహిళల సమస్యలపై ఇలియానా గతంలో కూడా మాట్లాడారు. తాను మానసిక సమస్యలతో ఇబ్బంది పడినట్టు పబ్లిక్‌గా చెప్పారు. హీరోయిన్లు ఈ విధంగా మాట్లాడటం వల్ల సాధారణ మహిళలకు ధైర్యంగా ఉంటుందని మానసిక విశ్లేషకులు అంటున్నారు.
Also Read: నువ్వు రౌడీ అయితే నేను రౌడీ ఇన్‌స్పెక్టర్.. అన్నీ చేశాకే ఇక్కడొచ్చి కూర్చున్నాం.. అన్‌స్టాపబుల్ కొత్త ప్రోమో వచ్చేసింది!
Also Read: 'జబర్దస్త్' నుంచి అభి అవుట్... 'హైపర్' ఆది కామెంట్!
Also Read: జనవరి 11 ఎపిసోడ్: ప్రేమని అక్షరాలుగా మలిచిన రిషి, చాలా బాగా రాశారన్న వసు... గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్..
Also Read: సినిమాలోనూ తండ్రీ కూతుళ్లుగా... అందరూ వద్దన్నా సరే!
Also Read: జనవరి 11 ఎపిసోడ్: తాడికొండలో సౌందర్య ఎంట్రీ, నీడలా వెంటాడిన మోనిత.. కార్తీకదీపం మంగళవారం ఎపిసోడ్
Also Read: సుకుమార్ బర్త్‌డేను వైఫ్ ఎలా సెలబ్రేట్ చేసిందో చూశారా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి