కార్తీకదీపం జనవరి 11 మంగళవారం ఎపిసోడ్


సౌందర్య, ఆనందరావు ప్రకృతి ఆశ్రమానికి బయలుదేరుతుండగా అక్కడకు వచ్చిన మోనిత...వీళ్లు ఎక్కడికి వెళుతున్నారు, కార్తీక్ ఆచూకీ ఏమైనా తెలిసిందా అని అనుకుంటుంది. ఆదిత్య, శ్రావ్యకి జాగ్రత్తలు చెబుతుంటే విని ఏంటీ సెంటిమెంట్ సీన్, వీళ్లు ఎక్కడికి వెళుతున్నారు, ఎందుకు వెళుతున్నారని అనుకుంటుంది. వాళ్లు అటు వెళ్లడమే తరువాయి..ఆ కారుని పాలో అయి వెళుతుంది మోనిత.


ఇంట్లో బాబుని కార్తీక్ ఆడిస్తుంటే దీప పాలు కలిపి తెస్తుంది.ఈ వయసులో పిల్లలు రాత్రంతా ఏడుస్తూ పెద్దవాళ్లకి నిద్రలేకుండా చేస్తారు కానీ వీడు మాత్రం అస్సలు ఏడవడు అంటుంది. ఏరా నువ్వు ఏడవ్వా అంటే..అరే అనకండి ఎందుకంటే వీడీపేరు మావయ్యగారి పేరే అంటుంది దీప. ఒక్కసారిగా మోనితని గుర్తుచేసుకున్న కార్తీక్... వీడు పేరు పెట్టి పిలిచినప్పుడు నీకు మావయ్య గారు గుర్తొస్తే..నాకు ఆ మోనిత గుర్తొస్తోంది అంటాడు కార్తీక్. ఇంతదూరం వచ్చాక కూడా అవన్నీ ఎందుకు గుర్తుకు తెచ్చుకుంటారని దీప అంటే..నా వల్ల కావడం లేదు దీప, మోనిత మన కుటుంబాన్ని అల్లకల్లోలం చేసిందని కార్తీక్ అంటాడు. ఆనంద్ అని పిలిచినప్పుడు మావయ్యగారిని, ఆయనతో గడిపిన బాల్యాన్ని గుర్తుచేసుకోండి అంతేకానీ మోనితని మైండ్ లోంచి తీసేయండి అంటుంది దీప.


Also Read: వంటలయ్యగా మారిన డాక్టర్ బాబు, ప్రకృతి ఆశ్రమానికి సౌందర్య, ఆనందరావు.. కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
సౌందర్య -ఆనందరావు కారుని వెంబడిస్తున్న మోనిత...బ్యాగ్ సర్దుకుని వెళుతున్నారంటే కార్తీక్ దగ్గరకే అయిఉంటుంది, మీరెక్కడికి వెళ్లినా మీ వెంటే ఉంటా...కార్తీక్ కనిపించగానే కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతా..ఆ తర్వాత ఆనందరావుని వెతుక్కుంటా అంటుంది మోనిత. కట్ చేస్తే భోజనం వడ్డించా రండి అంటుంది దీప. పిల్లలు తిన్నారా అంటే తిన్నారని చెప్పి  మధ్యాహ్నం బియ్యం కొనితీసుకొచ్చా అంటుంది. అన్ను నీ చంటిబిడ్డలా, అపురూపంగా చూడడం మానేసి నీ భర్తలా మాత్రమే చూడు..భారం మొత్తం నీపై వేసుకుని చిరునవ్వు నవ్వుతుంటే నేను తట్టుకోలేకపోతున్నా దీప అంటాడు కార్తీక్. నేను రేపటి నుంచి పొరుగూరులో వంటపని చేయడానికి వెళుతున్నా..ఈ విషయం రుద్రాణికి చెప్పను అని వాళ్లు అన్నారు..మీరు అవసరం లేని వాటి గురించి ఆలోచించవద్దంటుంది దీప. హోటల్లో పనిచేస్తానంటే నా ఆరోగ్యం పాడవుతుందని మీరొప్పుకోరని నాకు తెలుసు అందుకే అబద్ధం చెబుతున్నా నన్ను క్షమించండి డాక్టర్ బాబు అనుకుంటుంది దీప. అంతలోనే దీపా ఎక్కువగా తిరుగుతున్నావు, నీ ఆరోగ్యం జాగ్రత్త అంటాడు కార్తీక్.


Also Read: కళ్లలో దాగి ఉన్న కలలు అద్భుతం, పడి పడి చదివేలా నీ మనసు నా పుస్తకం.. నెక్ట్స్ లెవెల్ కి చేరిన గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్...
సౌందర్య కారుని వెంబడిస్తున్న మోనిత తాడికొండ గ్రామంలోకి ఎంట్రీ ఇస్తారు. తాడికొండా ..ఇది ప్రియమణి వాళ్ల ఊరు కదా సౌందర్య ఆంటీ ఇక్కడకు ఎందుకు వచ్చినట్టు, కొంపతీసి ప్రియమణి పార్టీ మార్చి వీళ్లకి హెల్ప్ చేస్తోందా ఏంటీ..చెప్పలేం..నువ్వు కనిపిస్తే పీక పిసికి చంపేస్తా అనుకుంటుంది. ఇంట్లో పిల్లలకు టిఫిన్ పెట్టేందుకు అన్నీ సిద్ధం చేసిన కార్తీక్ దీప ఇంకా ఇంటికి  రాలేదేంటనే ఆలోచనలో పడతాడు. ఇంతలో వండిన అన్నం తీసుకొచ్చి పెడతాడు...అన్న జిగురుగా ఉందని పిల్లలు అంటే..భోజనాన్ని విమర్శించకూడదు తినండి అని చెబుతాడు. ఇంతలో అక్కడకు వచ్చిన దీప..వంట నేను చేసేదాన్ని కదా అంటూ..పంట బియ్యం అన్నం ఇలాగే ఉంటుంది ఆరోగ్యానికి మంచిది అని చెబుతుంది. మరోవైపు ప్రకృతి వైద్యశాలకు చేరుకుంటారు సౌందర్య, ఆనందరావు. అది చూసిన మోనిత ఇందుకా వీళ్లు వచ్చింది..ప్రకృతి వైద్యశాలకు వచ్చారంటే మావయ్యగారికి ఆరోగ్యం బాగాలేనట్టుంది..అయినా వీళ్ల జీవితాలు ప్రకృతికే అంకితం..నేను కార్తీక్ కే అంకితం అనుకుని..ప్రియమణిది ఇదే ఊరు కదా వెతికితే పోలా..దేనికైనా పనికొస్తుంది అనుకుంటుంది.  


Also Read: వామ్మో.. డాక్టర్ బాబుకి సినిమా కష్టాలు మరీ ఈ రేంజ్ లోనా.. కార్తీకదీపం శనివారం ఎపిసోడ్
నేను వచ్చి వంట చేసి పెట్టేదాన్ని కదా అంటే..ఖాళీగా ఉన్నా రాజు రాజే కదా అంటుంది. బియ్యం అని కార్తీక్ మాట్లాడబోతుంటే..  కష్టాలు పిల్లలకు రేపు పాఠాలుగా ఉపయోగపడతాయి అంటుంది. దీపా మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళుతున్నాను, హిమ-శౌర్య అన్నం తింటూ ఇదేంటని అడిగితే ఏమీ చేయలేకపోతున్నా అంటాడు. మనకు డబ్బు మాత్రమే లేదు డాక్టర్ బాబు అన్న దీప.. సౌకర్యాలకు , విలాసాలకు అంతం ఏముంది..బడిలో పాఠాలు నేర్చుకుంటున్నారు, జీవిత పాఠాలు ఇలా నేర్చుకుంటున్నారని చెబుతుంది. అమ్మా మమ్మల్ని స్కూల్ కి తీసుకెళతావా అని అడిగితే నేను వెళ్లి దింపి వస్తానులే అంటాడు కార్తీక్. నేను రావడానికి లేటవుతుంది కంగారు పడకు అంటాడు. డాక్టర్ బాబు ఏదైనా పనిచేస్తున్నారా ..అడిగితే బాధపడతారు అనుకుంటుంది దీప. ఎపిసోడ్ ముగిసింది.


రేపటి ఎపిసోడ్ లో...
సౌందర్యని వెంబడిస్తూ తాడికొండలో ఎంట్రీ ఇచ్చిన మోనిత కార్తీక్ వాళ్లని వెతికే పనిలో పడుతుంది. అదే సమయానికి దీప అటుగా వెళుతుంది. ఇంతలో బాబు ఏడుపు వినిపించడంతో మోనిత ఎవరో బాబు ఏడుస్తున్నాడు..నా ఆనందరావు కూడా ఇలాగే ఏడుస్తుంటాడు..బాబు అంతలా ఏడుస్తున్నా ఆ తల్లి పట్టించుకోవడం లేదేంటి అనుకుంటుంది. బాబు ఏడుపు వినిపించిన వైపు వెతుక్కుంటూ వెళుతుంది దీప...


Also Read:  రుద్రాణికి షాక్ ఇచ్చిన దీప..తాడికొండలో సౌందర్య ఎంట్రీ ఉండబోతోందా.. కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్
Also Read: ఐ లవ్ వసుధార అనేసిన గౌతమ్..షాక్ లో రిషి.. గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి