Just In





Lata Mangeshkar Hospitalised: ఐసీయూలో లతా మంగేష్కర్... కరోనాతో ఆస్పత్రిలో చేరిక
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

లెజెండరీ సింగర్, నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారతరత్న లతా మంగేష్కర్ కరోనా బారిన పడ్డారు. దాంతో ఆమెను ముంబైలోని బీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే... అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
లతా మంగేష్కర్‌కు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ... ఆమె వయసు రీత్యా ఐసీయూకు షిఫ్ట్ చేశారు. కరోనాతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, వాటితో పాటు ఆమె వయసును దృష్టిలో పెట్టుకుని వైద్యులు నిశితంగా ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని సమాచారం. లతా మంగేష్కర్ నవంబర్, 2019లో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఓసారి ఆస్పత్రి పాలయ్యారు.
Also Read: ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో బాలకృష్ణ కుమార్తె ఫస్ట్ స్టెప్... 'అన్‌స్టాపబుల్' సక్సెస్ స్టెప్
Also Read: టిక్కెట్ల ఇష్యూలో " బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?" అనే ప్రశ్న వస్తుందన్న ఆర్జీవీ ! దీని అర్థం ఏమిటి ?
Also Read: పీరియడ్స్‌పై ఇలియానా షాకింగ్ కామెంట్స్
Also Read: ఆమె ఆవేదన అక్షర రూపంలో... అయిదేళ్ల మౌనం తరువాత తొలిసారి స్పందించిన భావన
Also Read: 'జబర్దస్త్' నుంచి అభి అవుట్... 'హైపర్' ఆది కామెంట్!
Also Read: నువ్వు రౌడీ అయితే నేను రౌడీ ఇన్‌స్పెక్టర్.. అన్నీ చేశాకే ఇక్కడొచ్చి కూర్చున్నాం.. అన్‌స్టాపబుల్ కొత్త ప్రోమో వచ్చేసింది!
Also Read: సినిమాలోనూ తండ్రీ కూతుళ్లుగా... అందరూ వద్దన్నా సరే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి