మనిషికి పంది గుండె అమర్చారంటూ గొప్ప విజయాన్ని సాధించారని అమెరికా వైద్యులకు ప్రపంచం అంతా వీర తాళ్లేస్తోంది. మన దగ్గర కూడా అనేక మంది ఎంతో గొప్పగా చెబుతున్నారు. కానీ ఈ విషయంలో మన ఇరవై ఏళ్ల ముందున్నాం. అంటే ఇరవైఏళ్ల కిందటే భారత వైద్యుడొకరు మనిషికి పంది గుండె అమర్చారు. కానీ ఆ డాక్టర్‌ను ప్రోత్సాహించాల్సిపోయి తప్పు చేశారని కేసులు పెట్టి జైల్లో వేశారు. అతని ఆస్పత్రిని నాశనం చేశారు. అప్పుడే అతన్ని ప్రోత్సహించి ఉంటే.. ప్రపంచానికే దారి చూపే ఓ గొప్ప వైద్య పరమైన అద్భుతం ఇండియాలోనే పురుడు పోసుకున్నట్లయ్యేది.
అస్సాంకు చెందిన డాక్టర్ ధనిరామ్ బారువా 1997లో తన ఆస్పత్రిలోనే గుండె పూర్తిగా దెబ్బతిన్న ఓ వ్యక్తికి పంది గుండె అమర్చారు. అతనికి హాంకాంగ్ సర్జన్ ఒకరు సహకరించారు. బారువా అప్పట్లో తన ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాలతోనే ఈ ఆపరేషన్ పూర్తి చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయింది కూడా. పేషంట్ వారం రోజులు బాగానే ఉన్నాడు. కానీ ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు వచ్చి చనిపోయాడు. దీంతో దుమారం రేగింది. మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా ఆ వైద్యులపై ఆరోపణలు చేశారు. దీంతో పోలీసులు కేసులు పెట్టి డాక్టర్ బారువాను అరెస్ట్ చేశారు.
Also read: ‘స్క్రూ డ్రైవర్’ కాక్‌టెయిల్... ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు
నలభై రోజుల పాటు జైల్లో ఉన్న డాక్టర్ బారువా తర్వాత విడుదలయ్యారు. కానీ అతను బయటకు వచ్చే సరికి ఆస్పత్రిని కూడా కొంత మంది ధ్వంసం చేశారు. అయినా డాక్టర్ బారువా తన పట్టుదల మాత్రం వదిలి పెట్టలేదు. గుండె సంబంధిత వ్యాధులపై పరిశోధనలు చేస్తున్నారు. 2008లో గుండె వ్యాదులను నివారించే జెనెటికల్లీ ఇంజినీర్డ్ వ్యాక్సిన్‌ను కనిపెట్టినట్లుగా ప్రకటించారు. 2015హెచ్‌ఐవీ కి కూడా మందు కనిపెట్టినట్లుగా ప్రకటించారు. ఆయితే ఆయనపై అంతకు ముందు ఓముద్ర వేసి ఉండటంతో ఎవరూ పట్టించుకోలేదు.
Also read: పిల్ల మామూలుది కాదు, గుద్దితే చెట్లు విరగాల్సిందే... ‘వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ గర్ల్’ వీడియో చూడండి
ఇప్పుడు అమెరికా వైద్యులు మనిషికి పంది గుండె అమర్చిన వ్యహారంలో వైద్యులకు గొప్ప ప్రశంసలు లభిస్తున్నాయి. కానీ ఇండియాలో ఆ పని చేస్తే తప్పు చేశారని జైల్లో పెట్టారు. మన వాళ్లు చేస్తే .. తప్పుడు పని చేశారని అరెస్టులు చేయడం.. వేరే వాళ్లు చేస్తే గొప్పగా చేశారని ప్రశించడం వంటి వ్యవహారాలు .. మన దేశ టాలెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. బారువా ప్రయత్నాలకు అప్పట్లోనే ప్రభుత్వాల సపోర్ట్ లభించి ఉంటే.. ఇప్పటికి గుండె మార్పిడి చికిత్సలకు కేంద్రంగా భారత్ అయి ఉండేది. కొన్ని వేల మంది ప్రాణాలు బయటపడి ఉండేవి. అందుకే అంటాం.. అద్భుతాలు జరిగినప్పుడు గుర్తించరు.. జరిగిపోయిన తర్వాత ఎవరికీ అవసరం లేదు అని. ఆ విషయం డాక్టర్ బారువాను చూస్తే అర్థమైపోతుంది.