Paytm Shares Down: దేశంలో డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది పేటీఎం! పెద్ద నోట్ల రద్దు సమయంలో ఈ యాప్‌నకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. లావాదేవీల రేటులో వృద్ధి నమోదైంది. ఒకప్పుడు పట్టణాల్లోని యువతకే పరిమితమైన పేటీఎం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఫేమస్ అయింది! చెల్లింపుల్లో సూపర్ హిట్టైన పేటీఎం స్టాక్ మార్కెట్లో మాత్రం ఘోరంగా విఫలమైంది! ఇన్వెస్టర్ల డబ్బుకు తగిన రాబడి ఇవ్వలేకపోయింది. షేరు ధర ఇంకా పడిపోయే ప్రమాదం ఉంది!!
పేటీఎం రూ.18,000 కోట్లతో ఐపీవోకు వచ్చింది. ఒక్కో షేరును రూ.2080కు కేటాయించింది. 2021, నవంబర్ 18న పేటీఎం స్టాక్ మార్కెట్లో నమోదైంది. తొలి రోజే ఇన్వెస్టర్లకు షాకిచ్చిన షేరు ఆ తర్వాత దానిని అలవాటుగా మార్చేసింది. యాంకర్ ఇన్వెస్టర్లు షేర్లను తెగనమ్మడంతో రూ.1269కి చేరుకుంది. వారంలో ఎక్కువ రోజులు నష్టాల్లోనే ట్రేడ్ అవుతోంది. ఇప్పటి వరకు 40 శాతం వరకు ధర పతనమైంది. మరికొన్ని రోజుల్లో 50 శాతానికి పతనమై రూ.900 వద్ద షేరు ధర స్థిరపడుతుందని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ మాక్వారీ అంచనా వేస్తోంది.
Also Read: Multibagger stock: పెన్నీ స్టాక్.. 2 ఏళ్లు.. లక్ష పెట్టుబడి.. రూ.50 లక్షలు ప్రాఫిట్!
Also Read: CCD New CEO Malavika Hegde: భర్త విధికి తలవంచితే.. ఆమె ఎదిరించి నిలబడింది.. ఓ మంచి కాఫీ లాంటి కథ!
తాజాగా పేటీఎం బీమా రంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. రెగ్యులేటరీ ఇబ్బందులు తొలగకపోవడంతో బీమా నియంత్రణ సంస్థ (IRDAI) అనుమతిని నిరాకరించింది. అడ్డంకులు తొలగేందుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ఆర్బీఐ ప్రతిపాదించిన డిజిటల్ చెల్లింపు నియంత్రణ ఆంక్షలు పేటీఎం వాలెట్ రుసుములపై పరిమితులకు దారితీయొచ్చు. దాదాపుగా ఆ సంస్థకు 70 శాతం ఆదాయం డిజిటల్ చెల్లింపుల పైనే వస్తోంది. పరిమితి ఆంక్షలు వస్తే ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
ప్రస్తుతం క్రెడిట్, డెబిట్, వాలెట్ల ద్వారా డిజిటల్ లావాదేవీలు చేపడితే 2-2.5 శాతం వరకు రుసుములు చెల్లించాల్సి వస్తోంది. ఆర్బీఐ పరిమితులు విధిస్తే ఈ రుసుములు తగ్గే అవకాశం ఉంది. ఇది పేటీఎం వంటి సంస్థలపై ప్రభావం చూపించనుంది. ఇక ఉద్యోగులు సైతం వేరే సంస్థలకు వెళ్లిపోతున్నారు. అట్రిషన్ రేటు పెరగడంతో ఉద్యోగుల ఖర్చూ పెరగనుంది. ఒకప్పటితో పోలిస్తే రుణాల జారీ తగ్గిపోయింది. ఇలా చాలా అంశాలు పేటీఎం రాబడి, లాభదాయకపై ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో షేరు ధర మరింత తగ్గుతుందని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయని బిజినెస్ ఇన్‌సైడర్ కథనం పేర్కొంది.
Also Read: PNB Service Charges: కస్టమర్లకు పీఎన్‌బీ షాక్! సర్వీస్ ఛార్జెస్ పెంచేసిన పంజాబ్ బ్యాంక్
Also Read: Reliance Mandarin Hotel Deal: అమెరికాలో ఫైవ్‌స్టార్ హోటల్ కొనుగోలు చేసిన రిలయన్స్.. ఎంతకో తెలుసా?
Also Read: Anand Mahindra: మహీంద్రా కాకుండా వేరే కార్లున్నాయా? ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం!!