నిధుల కోసం ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు ఉపసంహరిస్తున్న కాలమిది! అలాంటిది టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియాలో కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా అవతరించింది. నష్టాలతో విలవిల్లాడుతున్న ఈ కంపెనీలో 36 శాతం వాటాను సొంతం చేసుకుంది.
ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుణాలను వొడాఫోన్ ఐడియా బోర్డు ఈక్విటీగా మార్చేందుకు నిర్ణయించింది. దాంతో దేశంలోనే మూడో అతిపెద్ద టెలికాం సంస్థలో ప్రభుత్వానికి 36 శాతం వాటా దక్కింది. దాంతో 'వి'లో ఇప్పటికే ఉన్న వాటాదారులు, కంపెనీ, స్థాపకుల వాటాల విలువ తగ్గిపోయింది. వొడాఫోన్ గ్రూపునకు 28.5 శాతం, ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు 17.8 శాతం వాటా దక్కింది.
Also Read: Multibagger stock: పెన్నీ స్టాక్.. 2 ఏళ్లు.. లక్ష పెట్టుబడి.. రూ.50 లక్షలు ప్రాఫిట్!
Also Read: CCD New CEO Malavika Hegde: భర్త విధికి తలవంచితే.. ఆమె ఎదిరించి నిలబడింది.. ఓ మంచి కాఫీ లాంటి కథ!
'2022, జనవరి 10న బోర్డ్ ఆఫ్ డైరెక్లర్లు సమావేశం నిర్వహించారు. స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించిన వడ్డీ, ఏజీఆర్ చెల్లింపులను ఈక్విటీగా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు' అని వొడాఫోన్ ఐడియా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి తెలిపింది. స్పెక్ట్రమ్ వేలం నెట్ ప్రజెంట్ వాల్యూ, ఏజీఆర్ వడ్డీలు రూ.16,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. 2021, మార్చి నాటికి 'వి'కి రూ.1.80 లక్షల కోట్ల రుణాలు ఉన్నాయి.
రిలయన్స్ జియో టెలికాం రంగంలో ప్రవేశించిన తర్వాత ఐడియా తట్టుకోలేకపోయింది. తక్కువ ధరల యుద్ధంలో ఐడియా వినియోగదారులు ఎక్కువగా జియోకు తరలిపోయారు. ఫలితంగా కంపెనీ నష్టాల్లో చిక్కుకుంది. వీటి నుంచి బయటపడి మార్కెట్లో నిలదొక్కుకొనేందుకు వొడాఫోన్‌తో కలిసి వొడాఫోన్ ఐడియాగా జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. అయినప్పటికీ లాభాలేమీ రాలేదు. రుణాలు పెరిగిపోయాయి. తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వ రుణాలను ఈక్విటీగా మార్చాల్సి వచ్చింది.
'వి'లో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా మారిందని తెలియడంతో మంగళవారం వొడాఫోన్ ఐడియా కంపెనీ షేర్లు 19 శాతం నష్టపోయాయి. ట్రేడింగ్ సెషన్ ఆరంభంలో షేరు ధర రూ.12.05కు చేరుకుంది. 11.30 గంటల సమయంలో కాస్త పుంజుకొని రూ.13 వద్ద కొనసాగుతోంది.
Also Read: PNB Service Charges: కస్టమర్లకు పీఎన్‌బీ షాక్! సర్వీస్ ఛార్జెస్ పెంచేసిన పంజాబ్ బ్యాంక్
Also Read: Reliance Mandarin Hotel Deal: అమెరికాలో ఫైవ్‌స్టార్ హోటల్ కొనుగోలు చేసిన రిలయన్స్.. ఎంతకో తెలుసా?
Also Read: Anand Mahindra: మహీంద్రా కాకుండా వేరే కార్లున్నాయా? ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం!!