కరోనా మహమ్మారి వ్యాపార ప్రపంచాన్ని కుదిపేసింది! ఈ వైరస్‌ వల్ల చాలా రంగాల్లో చిన్న, మధ్య తరహా కంపెనీలు మూతపడ్డాయి. కొన్ని భారీ సంస్థలు సైతం నష్టాల్లో కూరుకుపోయాయి. కొన్నింటి అమ్మకాలు పడిపోయాయి. ప్రపంచంలోనే అతిపెద్ద  కండోమ్‌ తయారీ కంపెనీ 'కారెక్స్‌' సైతం ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటోంది.


'తానొకటి తలిస్తే విధి మరొకటి తలుస్తుంది' అనడం మనం వినే ఉంటాం! కారెక్స్‌ విషయంలో ఇదే నిజమైంది!!


ప్రపంచంలోనే అతిపెద్ద కండోమ్‌ తయారీ కంపెనీ కారెక్స్‌.  ఇది మలేషియాలో ఉంది. తరచుగా మనకు వినిపించే 'డ్యూరెక్స్‌' బ్రాండ్‌ కండోమ్స్‌ను ఇదే ఉత్పత్తి చేస్తుంది. ఈ భూమ్మీద వాడే ప్రతి ఐదు కండోముల్లో ఒకటి ఈ కంపెనీదే అయి ఉంటుంది! సువాసనలు వెదజల్లే రబ్బర్లు (కండోమ్‌) తయారు చేయడం దీని స్పెషాలిటి. ఏటా 140 దేశాలకు 500 కోట్ల కండోమ్‌లను ఎగుమతి చేస్తుంటుంది. రెండేళ్ల ముందు వరకు దీనికి తిరుగులేదు. లాభాలే.. లాభాలు!!


Also Read: ITR Filing Date Extended: టాక్స్‌ పేయర్లకు గుడ్‌న్యూస్‌! మార్చి 15 వరకు గడువు పెంపు


Also Read: Paytm Shares Down: ఇదేంది సామి!! 50% పతనమవ్వనున్న పేటీఎం షేరు! రూ.900కి వస్తుందంటున్న బ్రోకరేజ్‌ సంస్థలు


Also Read: Vodafone Idea Shareholders: వొడాఫోన్‌ ఐడియాలో కేంద్రానికి '36%' వాటా.. 19% నష్టపోయిన షేరు!!


కరోనా వైరస్‌తో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ లాక్‌డౌన్లు అమలు చేశారు. ప్రజలంతా ఇళ్లలోనే బందీలుగా ఉన్నారు. ఎన్నో వ్యాపారాలు పతనమైన సందర్భమది. కారెక్స్‌ మాత్రం తనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనే అనుకుంది. మరో రకంగా చెప్పాలంటే కాస్త సంతోషించింది. ఎందుకంటే లాక్‌డౌన్‌లో ప్రజలంతా ఇళ్లలోనే ఉంటారు కాబట్టి మనుషుల మధ్య ఎక్కువగా రొమాన్స్‌ జరుగుతుందని సంబర పడింది. కండోమ్‌ల ఉత్పత్తి మరింత పెరుగుతుందని ఆనందించింది.


అలాంటిది 'కారెక్స్‌' కంపెనీకి వరుస షాకులు తగిలాయి. ఏడాదికి 20 శాతం సగటుతో రెండేళ్లలో 40 శాతం కండోమ్‌ అమ్మకాలు తగ్గిపోయాయి. కరోనా భయంతో మొదట్లో భార్యాభర్తలు శృంగారం చేసుకొనేందుకు వెనకాడారు. దాంతో కాంట్రాసెప్టివ్‌ వినియోగం తగ్గిపోయింది. హోటల్‌ పరిశ్రమ కుదేలవ్వడమూ పక్కలో బల్లెంలా మారింది. హోటళ్లు, అత్యవసరం కాని సెక్సువల్‌ వెల్‌నెస్‌ కేంద్రాలు మూతపడటం, ప్రభుత్వాలు కండోమ్‌లను పంచడం ఆపేయడంతో అమ్మకాలు తగ్గిపోయాయి. దాంతో మలేసియా బెంచ్‌మార్క్‌ స్టాక్‌ సూచీలో ఈ కంపెనీ షేర్ల ధర 18 శాతం పడిపోయింది.


నష్టాల నుంచి బయటపడేందుకు కారెక్స్‌ ఓ వినూత్న ఆలోచన చేసింది. వైద్యారోగ్య రంగానికి ఉపయోగపడే చేతి గ్లోవ్స్‌ను తయారు చేయాలని నిర్ణయించుకుంది. అతి త్వరలోనే గ్లోవ్స్‌ ఉత్పత్తి ఆరంభం కాబోతోంది. బహుశా ఇది ఆ కంపెనీకి తిరిగి లాభాలను తీసుకురావచ్చు!!