‘‘మా ఇంట్లో చేపల పులుసు వండారు’’ అని చెప్పగానే.. మాంసాహారులకు తప్పకుండా నోట్లో నీళ్లు ఊరుతాయ్. కానీ, ‘‘మా ఇంట్లో చేపల వీర్యం పులుసు’’ అని చెబితే.. ఛీ యాక్, అంటూ ఉమ్మేయడం ఖాయం. కానీ, అక్కడ మాత్రం ఆ వంటకాన్ని లొట్టలేసుకుని మరీ తినేస్తున్నారు. అంతేకాదు.. చేప కళ్లను సైతం వదలకుండా నమిలేస్తున్నారు. ఇంతకీ ఎక్కడా అనుకుంటున్నారా?? ఇంకెక్కడ జపాన్‌లో.
జపాన్ ప్రజలు తెలివైనవారని మనకు తెలుసు. కానీ, వారు అంత చురుగ్గా ఉండటానికి.. వారు తినే ఇలాంటి ఆహారమే కారణమా అని ఒక్కోసారి.. ఆహార ప్రియులకు కూడా సందేహం వేస్తుంది. కానీ.. మరీ తెలివితేటల కోసం మనసు డిస్ట్రబ్ అయ్యే ఆహారాన్ని లాగించలేం కాదా. జపాన్ ప్రజలకు మాత్రం అవేవీ పట్టవు. నడిచేవి.. ఎగిరేవి.. ఈదేవీ.. పాకేవీ.. ఇలా అన్నీ తినేస్తారు. చివరికి.. ఇదిగో చేపల వీర్యాన్ని కూడా వదలకుండా కూర వండేస్తున్నారు. ఆ వీర్యం వంటకం గురించి పక్కన పెడితే.. ముందుగా, చేప కళ్లతో తయారు చేసే డిష్ గురించి తెలుసుకుందాం.
సాధారణంగా చాలామందికి టూనా చేపలంటే చాలా ఇష్టం. కానీ, జపానీయులకు మాత్రం.. టూనా చేప కళ్లంటే ప్రాణం. ఎందుకంటే.. అవి చేపకంటే రుచిగా ఉంటాయట. టూనా.. ఉప్పునీటిలో పెరిగే చేప. చాలామంది ఈ చేప కళ్లను వండకుండా బఠానీల్లా నోట్లో వేసుకుని పచ్చిగానే తినేస్తారట. కొంతమంది మాత్రం.. కూర చేసుకుని పద్ధతిగా తింటారట. వాటిని బాగా ఉడికించి అన్నంతోపాటు కలిపి ఇస్తారట. కొందరు.. వాటిని నూనెలో దోరగా వేయించి.. సోయా సాస్ వేసుకుని లాగించేస్తారట.
ఇక చేప వీర్యం వంటకానికి వస్తే.. దీన్ని ‘షిరకో’(Shirako) అని పిలుస్తారు. జపాన్ ప్రజలు తినే అంత్యంత భయానకమైన.. అరుదైన వంటకం ఇది. ఇది చూసేందుకు గొడ్డు తెల్ల సొనలా ఉంటుంది. కానీ, దాన్ని చేప వీర్యంతో తయారు చేస్తారు. ‘షిరకో’ అంటే ‘తెల్ల పిల్లలు’ అని అర్థం. దీన్ని ఎక్కువ అన్నం, పెరుగుతో కలిపి వడ్డిస్తారు. చేప వీర్యంతో తయారు చేసే వంటకం చూసేందుకు చాలా బాగుంటుందట. కానీ, టేస్ట్ మాత్రం తెలియదట. అలాంటప్పుడు అది తినడం ఎందుకు వేస్ట్ కదా అనేగా మీ సందేహం. ఇందులో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, B12, విటమిన్-D వల్ల చర్మానికి మేలు జరుగుతుందట. వృద్ధాప్య ఛాయలు దరిచేరవట. ఇది తెలిశాక మీకు కూడా తినాలనిపిస్తోంది కదూ! కానీ, చేప వీర్యాన్ని ఎలా సేకరిస్తారని మాత్రం అడగొద్దు.
Note: ఇది ‘ఏబీపీ దేశం’ ఒరిజినల్ కంటెంట్. కాపీరైట్స్ కింద చర్యలు తీసుకోబడతాయి.
Also Read: ఈ చేప భలే డ్రైవింగ్ చేస్తోంది.. ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసు పెట్టరు కదా?
Also Read: తత్కాల్‌లో రైల్వే టికెట్స్ వేగంగా బుక్ చేయాలా? ఇదిగో ఇలా చేయండి
Also Read: నరక ద్వారం.. 50 ఏళ్లుగా ఇక్కడి భూమి మండుతూనే ఉంది.. చిన్న తప్పు ఎంత పనిచేసింది!
Also Read: షాకింగ్ వీడియో: విహారంలో విషాదం.. పర్వతం విరిగి బోటుపై పడింది
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి