Tammareddy : జాతకాలు తేల్చుకుందాం.. దమ్ముంటే ఓపెన్‌ డిబేట్‌కు రండి.. వైఎస్అర్‌సీపీ ఎమ్మెల్యేలకు తమ్మారెడ్డి సవాల్ !

సినీ పరిశ్రమపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి చేసిన విమర్శలు దుమారం రేపుతున్నాయి. టాలీవుడ్‌ ప్రముఖులు ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా ఓపెన్ డిబేట్‌కు రావాలని తమ్మారెడ్డి భరద్వాజా సవాల్ చేశారు.

Continues below advertisement

సినిమా వాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేపై పలువురు ప్రముఖులు మండి పడుతున్నారు. ఉదయం ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేయగా.. మధ్యాహ్నం మరో దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఎవరికి బలిసిందో తెలియాలంటే వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు దమ్ముంటే ఓపెన్ డిబేట్‌కు రావాలని సవాల్ విసిరారు.  " సినిమా వాళ్లంటే చీప్‌గా కనిపిస్తున్నారా ? ఎవరు బలిశారు ?.. మీ ఎమ్మెల్యేలు ఎంతెంత తింటున్నారు?.. మీ చరిత్రలేంటి?.. వాటి గురించి మాట్లాడదామా?.. ఓపెన్ డిబేట్‌కు వస్తారా ఎవరైనా?.. దమ్ముందా?.. " అని తమ్మారెడ్డి భరద్వాజ సవాల్ చేశారు. 

Continues below advertisement

Also Read: తెలంగాణలోనూ ఏపీ తరహా మార్పులు... త్వరలో ఆన్‌లైన్‌ ప్రక్రియ: తలసాని

మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ ఆస్తులెంత? ఇప్పుడెంత?సినిమా కోసం వందల మంది కష్టపడతారు. కష్టపడితే వచ్చే వచ్చే ప్రాజెక్టు అది. కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత పైసా పైసా ఏరుకుంటున్నాం. మీలాగా రూపాయి పెట్టి కోట్లు దోచుకు తినడం లేదు. మమ్మల్ని అనే ముందు మీ సంగతి మీరు చూసుకోండి. రాజకీయ నేతలు బెదిరింపులకు పాల్పడవద్దన్నారు. మమ్మల్ని బలుపు అనడానికి మీరెవరు అసలు? మీ బలుపు సంగతి మీరు చూసుకోండి. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదని సవినయంగా మనవి చేస్తున్నానని తమ్మారెడ్డి హెచ్చరించారు. 

Also Read: అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..? టికెట్ రేట్ ఇష్యూపై బాలయ్య వ్యాఖ్యలు..
  
రూ. కోట్లు ఖర్చు పెట్టి నాయకులను ఎన్నుకుంటున్నాం . మీరు రూపాయి పెట్టి కోట్లు కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. సామాజిక వర్గాల పేరుతో రాద్ధాంతం చేయడమెందుకని ప్రశ్నించారు.  కుల ప్రస్తావన లేకుండా ఉపాధి కల్పించేది సినిమా రంగం మాత్రమేనని స్పష్టం చేశారు. పుష్ప తీసిన నిర్మాతలు ఒక కులానికి చెందినవారు కావటం వల్లే మరో కులానికి చెందిన వారిని సినిమాలో తిట్టారని పలువురు ఆరోపిస్తున్నారు. సినిమా విషయంలో కులాలు, మతాలు ఎందుకు? గతంలో కొందరు నాయకులు రెచ్చిపోయి మాట్లాడారు. వాళ్లు గడ్డి తిన్నారని ఇప్పుడు మీరూ గడ్డి తింటున్నారా?మీకు ఒక సామాజిక వర్గం ఓట్లు వస్తే గెలవలేదు. అందరూ ఓట్లు వేశారని గుర్తు చేశారు.  

Also Read: బలిసికొట్టుకుంటోంది మీరే.. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేపై మండిపడిన నిర్మాత !

నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై మరో ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య కూడా స్పందించారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారిది బలుపు కాదు వాపని విమర్శించారు. అధికార అహంకారం తలెక్కితే పతనమే ఎదురవుతుందని ఆదిత్య హెచ్చరించారు. సినీ పరిశ్రమను చులకనగా మాట్లాడేవారి సంఖ్య ఏపీ అధికార పార్టీలో పెరుగుతూండటంతో ఒక్కొక్కరు బయటకు వచ్చి విమర్శలు గుప్పిస్తున్నారు. 

Also Read: సినిమా టిక్కెట్ రేట్ల కాన్సెప్ట్ బస్ టిక్కెట్లకు వర్తించదా !? ఏపీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 
Continues below advertisement
Sponsored Links by Taboola