"అతడే అన్నాడు (సిద్ధార్థ్ చేసిన ట్వీట్‌ను ఉద్దేశిస్తూ). ఇప్పుడు అతడే క్షమాపణలు కోరాడు. ఆ రోజు ట్విటర్‌లో నేను ట్రెండింగ్‌లో ఉండటం చూసి ఆశ్చర్యపోయా" అని స్టార్ బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యం గురించి ఈ నెల 5న ఆమె ఓ ట్వీట్ చేశారు. దాని కోట్ చేస్తూ సిద్ధార్థ్ చేసిన ట్వీట్ వివాదాస్పదం అయ్యింది.


జాతీయ మహిళా కమిషన్ సహా పలువురు సిద్ధార్థ్ తీరుపై విమర్శలు చేశారు. ఓ మహిళను అలా అనడం సరికాదని నిరసన వ్యక్తం చేశారు. జాతీయ మహిళా కమిషన్ అయితే అతడి మీద కేసు నమోదు చేయమని మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. ఇంకా పలువురు తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి క్షమాపణలు కోరుతూ సిద్ధార్థ్ ఓ లేఖ రాశారు. దానిపై సైనా నెహ్వాల్ స్పందించారు.
Also Read: అది గుడ్ జోక్ కాదు... సైనా నెహ్వాల్‌కు సిద్ధార్థ్ సారీ! అయితే... ఆ ఒక్కటీ ఒప్పుకోలేదు!
"సిద్ధార్థ్‌తో నేను మాట్లాడ‌లేదు. కానీ, అతను క్షమాపణలు కోరడం సంతోషంగా ఉంది. ఓ మహిళను అతడు అలా టార్గెట్ చేయకుండా ఉండాల్సింది. అయినా సరే... నేను దాని గురించి ఆలోచించడం లేదు. నేను సంతోషంగా ఉన్నాను. దేవుడు అతడిని చల్లగా చూడాలి" అని సైనా నెహ్వాల్ స్పందించారు. సిద్ధార్థ్ తప్పును గ్రహించి సారీ చెప్పడం సంతోషంగా ఉందని చెప్పారు. కానీ, ఎక్కడా సారీని యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఆమె చెప్పకపోవడం గమనార్హం.






Also Read: సిద్ధార్థ్ దేశానికి ఏం చేశాడు? కన్నీళ్లు పెట్టుకున్న సైనా నెహ్వాల్ తండ్రి
Also Read: ఇలా బెదిరిస్తే వచ్చి కొడతా.. ప్రభాస్ ఫ్యాన్స్ కి 'రాధేశ్యామ్' డైరెక్టర్ వార్నింగ్..
Also Read: విడాకుల తర్వాత మాంచి జోష్‌లో చైతూ.. పెళ్లి వద్దంటూ పాట!
Also Read: అప్పుడు వదినగా... ఇప్పుడు స్పెషల్ సాంగ్ భామగా!
Also Read: రిపోర్టులో 'నెగెటివ్'... ఫుల్ హ్యాపీగా త్రిష!
Also Read: ఫూల్స్ డే రోజు మహేష్ రాడట.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Also Read: 22 ఏళ్ల తరువాత మెగాస్టార్ తో రవితేజ.. ఈసారి ఎలాంటి హిట్ కొడతారో..?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి