Radha Krishna Kumar: ఇలా బెదిరిస్తే వచ్చి కొడతా.. ప్రభాస్ ఫ్యాన్స్ కి 'రాధేశ్యామ్' డైరెక్టర్ వార్నింగ్..

'రాధేశ్యామ్' చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్.. ప్రభాస్ అభిమానికి సోషల్ మీడియా వేదికగా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

Continues below advertisement

ప్రభాస్ హీరోగా దర్శకుడు రాధాకృష్ణకుమార్ 'రాధేశ్యామ్' అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా రిలీజ్ కాకముందే రాధాకృష్ణ పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. అన్నీ బాగుండి ఉంటే ఈ సంక్రాంతికి 'రాధేశ్యామ్' సినిమా థియేటర్లలో సందడి చేసేది. కానీ కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ ల దెబ్బకి వరుసపెట్టి సినిమాలు వాయిదా పడుతూనే ఉన్నాయి. 'రాధేశ్యామ్'ను కూడా అవాయిదా వేశారు. 

Continues below advertisement

కానీ ఇప్పటివరకు కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించలేదు. నిజానికి పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అందుకే కొత్త డేట్లను అనౌన్స్ చేయడం లేదు. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. 'మీరు ప్రభాస్ ని ఏమని పిలుస్తారని' ఓ నెటిజన్ ప్రశ్నించగా.. 'సార్' అని బదులిచ్చారు రాధాకృష్ణ. 

'సినిమా గురించి ఒక్క మాటలో చెప్పండి' అని మరో నెటిజన్ అడగ్గా.. 'లవ్' అని సమాధానమిచ్చారు. 'మీపై మీమ్స్ ను చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి..?' అని మరో నెటిజన్ ప్రశ్నించగా.. 'అవే నా స్ట్రెస్ బస్టర్స్' అని చెప్పారు రాధాకృష్ణ. ఇదే సమయంలో ప్రభాస్ ఫ్యాన్ ఒకరు.. 'హలో అన్నా.. రిప్లై ఇవ్వకపోతే సూసైడ్ లెటర్ రాసుకుంటా..' అని బెదిరించగా.. అది చూసిన రాధాకృష్ణ 'ఇలా బెదిరిస్తే వచ్చి బమ్స్ మీద కొడతా..' అంటూ నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశారు. రాధాకృష్ణ ఇచ్చిన స్వీట్ వార్నింగ్ కి పగలబడి నవ్వాడు సదరు నెటిజన్. 

Also Read: 22 ఏళ్ల తరువాత మెగాస్టార్ తో రవితేజ.. ఈసారి ఎలాంటి హిట్ కొడతారో..?

Also Read: ఫూల్స్ డే రోజు మహేష్ రాడట.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

 
Continues below advertisement