చాలా మంది మహిళలు నెలసరులు సరిగా రాకపోయినా పట్టించుకోరు. ముఖ్యంగా పెళ్లయి, పిల్లలున్న స్త్రీలు ఈ విషయంలో చాలా నిర్లక్ష్యం వహిస్తారు. పిల్లలు పుట్టేశారు కదా అన్న ధీమా అది. కానీ నెలసరి క్రమం తప్పితే అది చాలా అనారోగ్యాలకు సూచన. కాబట్టి తేలికగా తీసుకోకూడదు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే తల్లిగా మీ బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తించగలరు.
హార్మోన్స్ సమతుల్యత నెలసరుల్లో ముఖ్యపాత్ర వహిస్తాయి. హార్మోన్స్ సమయానికి విడుదలై ఆ ప్రభావం గర్భశయం మీద పడినప్పుడు ప్రతి నెలా పీరియడ్స్ వస్తాయి. హార్మోన్లలో అసమతుల్యత ఉంటే ఈ ప్రక్రియలో అంతరాయం కలుగుతుంది. ఒక్కోసారి నెలసరి సరిగా రాదు, వచ్చినా అధిక రక్తస్రావం అవుతుంది. అలాగే థైరాయిడ్ హార్మోన్ అధికంగా విడుదలైనా కూడా నెలసరులు తప్పుతాయి. కాబట్టి హార్మోన్ల సమతుల్యత చాలా అవసరం. అందుకే నెలసరుల్లో ఏదైనా తేడాగా అనిపిస్తే హార్మోన్ల ఇన్‌బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. లావుగా ఉన్నవారిలో, ఆహారంలో మార్పులు, నిద్రలో మార్పులు జరిగినా కూడా నెలసరులపై ప్రభావం పడుతుంది. అయితే నెలల తరబడి పీరియడ్స్ క్రమం తప్పడం, రాకపోవడం, అధిక రక్తస్రావం కావడం వంటివి కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
గర్భాశయంలో కణితులు ఉన్నా...
ఒక్కోసారి గర్భాశయంలో కణితులు, నీటిబుడగల్లాంటివి ఉన్నా కూడా నెలసరులు రావు. వచ్చినా అధికంగా బ్లీడింగ్ అవుతుంది. ప్రతి నెలా అధిక బ్లీడింగ్ అయినా కూడా తేలికగా తీసుకోరాదు. రక్త హీనత సమస్య ఏర్పడే అవకాశం ఉంది. అధిక రక్తస్రావానికి కారణమేంటో కచ్చితంగా తెలుసుకోవాలి. టెస్టుల్లో కణితులు, నీటిబుడగల్లాంటివి ఉంటే బయటపడతాయి. అవి కరిగేందుకు మందులు ఇస్తారు. వాటి తీవ్రతను బట్టి ఒక్కోసారి లాప్రోస్కోపీ అవసరం పడుతుంది.
ఒత్తిడి వద్దు
ఆరోగ్యకరమై ఆహారాన్ని తినాలి. పండ్లు, కూరగాయలు అధికంగా తినాలి. ఆహారంలో కార్బోహైడ్రైట్లను తగ్గించి, ప్రోటీన్లు ఎక్కువ తినాలి. రోజూ వ్యాయామాలు చేయాలి. జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధ్యానం చేయాలి.
Also read: వారానికోరోజు పుట్టగొడుగుల కూర... యాంగ్జయిటీ, డిప్రెషన్‌కు చెక్ పెట్టొచ్చు
Also read: సెలెబ్రిటీ గాసిప్స్ ఇష్టపడేవారికి తెలివి తక్కువగా ఉంటుంది... కొత్త అధ్యయన ఫలితం
Also read: పంది గుండె మనిషికి ప్రాణం పోసింది, చరిత్రలోనే తొలిసారిగా జంతువు గుండెతో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్
Also read: ఎక్కువ సమయం ఫోన్ చూస్తున్నారా? ఈ రోగాలు తప్పవు