ఆధునిక కాలంలో యాంగ్జయిటీ, డిప్రెషన్... ఇంకా ఎన్నో మానసిక రోగాలు దాడి చేస్తున్నాయి. ఇవన్నీ చాలా సాధారణ జీవితాన్ని చాలా ఇబ్బంది పెట్టేవే. ఇలాంటి సమస్యలకు మందులే కాదు, ఆహారాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వీటి లక్షణలు మరీ తీవ్రస్థాయిలో ఉంటేనే మందుల వరకు వెళ్లాలి. లేకుంటే మంచి ఆహారం, జీవన శైలి, వ్యాయామాల ద్వారానే తగ్గించుకోవాలి. కొన్ని అధ్యయనాల్లో పుట్టగొడుగుల్లోని కొన్ని రకాలు డిప్రెషన్‌ను తగ్గించే గుణాలను కలిగి ఉంటాయని తేలింది.
మ్యాజిక్ మష్రూమ్‌లు
మూడేళ్ల పాటూ సాగిన ఓ అధ్యయనం వివరాలను బ్రిటన్‌కు చెందిన గార్డియన్ పత్రిక ప్రచురించింది. లండన్లోని హోమర్ స్మిత్ ఆసుపత్రిలో డిప్రెషన్ బారిన పడి 56 ఏళ్ల మైఖెల్ చేరాడు. అతడు గత 30ఏళ్లుగా డిప్రెషన్‌తో పోరాడుతున్నాడు. ఎన్నో యాంటీ డిప్రెసెంట్ మందులను వాడినా ఫలితం లేదు. మ్యాజిక్ మష్రూమ్‌లుగా పిలిచే ఓ రకం పుట్టగొడుగుల్లో ఉండే సైలోసిబిన్ అనే పదార్థంతో తయారుచేసిన మాత్రలను (క్యాప్సుల్స్) మైఖెల్ కు ఇచ్చారు వైద్యులు. అవి అతనిపై ప్రభావవంతంగా పనిచేశాయి. మైఖెల్‌తో పాటూ మరో 60 మందికి వీటిని అందించారు. వారిలో కూడా చాలా సానుకూల మార్పులు కనిపించాయి.
పుట్టగొడుగులు తింటే మంచిది...
ఒక నివేదిక ప్రకారం పుట్టగొడుగులను తరచూ తినే వారిలో డిప్రెషన్ వచ్చే అవకాశం చాలా తక్కువ. అందుకే మానసిక ఆరోగ్యం కోసం వారానికి ఒక్కసారైనా తినమని ప్రోత్సహిస్తున్నారు ఆహారనిపుణులు. వైట్ బటన్ మష్రూమ్‌లు, లయన్స్ మేన్ రకం పుట్టగొడుగులు అధికంగా తింటారు ప్రజలు. ఇవి మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లను కలిగి ఉంటాయి. నిరాశ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలతో పాటూ ఎర్గోథియోనినన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటి డిప్రెసెంట్లుగా పనిచేస్తాయి.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: సెలెబ్రిటీ గాసిప్స్ ఇష్టపడేవారికి తెలివి తక్కువగా ఉంటుంది... కొత్త అధ్యయన ఫలితం
Also read: పంది గుండె మనిషికి ప్రాణం పోసింది, చరిత్రలోనే తొలిసారిగా జంతువు గుండెతో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్
Also read: ఎక్కువ సమయం ఫోన్ చూస్తున్నారా? ఈ రోగాలు తప్పవు