బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌కు మంగళవారం రాత్రి ట్విట్టర్ వేదికగా హీరో సిద్ధార్థ్ సారీ చెప్పారు. సైనాకు సారీ చెబుతూ ఓ లేఖ విడుదల చేశారు. అందులో తనది బ్యాడ్ జోక్ అని అంగీకరించారు. అయితే... తనపై వచ్చిన విమర్శల విషయంలో ఆ ఒక్కటీ ఒప్పుకోలేదు. తన ట్వీట్‌లో లింగవివక్ష లేదని ఆయన మరోసారి వివరించారు.
"డియర్ సైనా... కొన్ని రోజుల క్రితం మీరు చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా నేను చేసిన ట్వీట్‌లో అసభ్యకరమైన జోక్‌కు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. మీతో చాలా విషయాల్లో నేను ఏకీభవించకపోవచ్చు. అయితే... మీ ట్వీట్ చదివిన తర్వాత నాలో వచ్చిన కోపం కానీ, నా నిరాశ కానీ నేను ఉపయోగించిన భాషను, నా స్వరాన్ని సమర్థించలేవు. నేను చేసిన జోక్ విషయానికి వస్తే... దాన్ని వివరించాల్సి ఉంది. అది మంచి జోక్ కాదు. ఆ జోక్ విషయంలో సారీ" అని ట్వీట్ చేసిన లేఖలో సిద్ధార్థ్ పేర్కొన్నారు.
సైనా ట్వీట్‌కు ప్రతిస్పందనగా తాను చేసిన ట్వీట్‌లో ఉన్నది జోక్ అని చెప్పిన సిద్ధార్థ్... అందరూ విమర్శిస్తున్నట్టు అందులో హానికరమైన ఉద్దేశం లేదని చెప్పారు. ముఖ్యంగా 'కాక్' అనే పదాన్ని సిద్ధార్థ్ ఉపయోగించడం పట్ల చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తమ మాటల్లో ద్వందార్థం (డబుల్ మీనింగ్) లేదని విమర్శలు వచ్చిన వెంటనే సిద్ధార్థ్ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి వివరణ ఇచ్చారు. తాను స్త్రీవాద మిత్రుడినని, తన ట్వీట్‌లో సైనా నెహ్వాల్ మహిళ కనుక ఆమెపై ఆ కోణంలో దాడి చేయాలనే ఉద్దేశం లేదని సిద్ధార్థ్ చెప్పుకొచ్చారు. ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలికి, తన క్షమాపణల లేఖను స్వీకరిస్తారని ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. సైనా సెహ్వల్ ఎప్పటికీ తన ఛాంపియన్‌గా ఉంటారని తెలిపారు.
Also Read: సిద్ధార్థ్ దేశానికి ఏం చేశాడు? కన్నీళ్లు పెట్టుకున్న సైనా నెహ్వాల్ తండ్రి
సిద్ధార్థ్ క్షమాపణలు చెప్పాలని సైనా నెహ్వాల్ తండ్రి హర్వీర్ సింగ్ నెహ్వాల్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఈ క్షమాపణల లేఖపై ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read: అమ్మో! అజయ్‌కు రోజుకు ఐదు కోట్లు.... ఆలియాకు నిమిషానికి 50 లక్షలా?
Also Read: Pawan Kalyan's Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్ 'హరి హర వీర మల్లు' లేటెస్ట్ అప్‌డేట్...
Also Read: శ్రీదేవి కూతుళ్లనూ వదలని వైరస్... ఇద్దరినీ చుట్టేసింది
Also Read: రాక్షసుల రాజ్యంలో రాముడిగా అక్కినేని మనవడు
Also Read: సోదరి రాజకీయాలకు, నా సేవకు సంబంధం లేదు... దేని దారి దానిదే! - సోనూ సూద్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి