RRR Remunerations: అమ్మో! అజ‌య్‌కు రోజుకు ఐదు కోట్లు.... ఆలియాకు నిమిషానికి 50 ల‌క్ష‌లా?

'ఆర్ఆర్ఆర్'లో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలు పోషించారు. అందుకు, వాళ్లిద్దరికీ రెమ్యునరేషన్స్ బలంగా ఇచ్చారట.

Continues below advertisement

పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని, పాన్ ఇండియా మార్కెట్ కోసమని ఆర్టిస్టులను ఎంపిక చేయనని... క్యారెక్ట‌ర్స్‌ డిమాండ్ చేయడంతో అజయ్ దేవగణ్, ఆలియా భట్‌ను ఎంపిక చేశానని దర్శక ధీరుడు రాజమౌళి ఓ సందర్భంలో చెప్పారు. ఆయన క్యారెక్టర్స్ డిమాండ్ చేయడంతో వాళ్లిద్దరినీ ఎంపిక చేసి ఉండొచ్చు. అయితే... వాళ్లిద్దరికీ దేశవ్యాప్తంగా మార్కెట్ ఉంది. అందుకు తగ్గట్టుగా రెమ్యూనరేషన్స్ ఉంటాయి. 'ఆర్ఆర్ఆర్' యూనిట్ ఆ డిమాండ్‌కు తగ్గట్టుగా డబ్బులు ఇచ్చిందట.

Continues below advertisement

'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' కోసం అజయ్ దేవగణ్ ఏడు రోజులు షూటింగ్ చేయగా... ఏడు రోజులకు రూ. 35 కోట్లు తీసుకున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. అంటే... రోజుకు ఐదు కోట్ల రూపాయలు అన్నమాట. అదే నిజం అయితే... ఆ లెక్కన సినిమా కోసం మూడేళ్లు కష్టపడిన హీరోలకు దక్కిన రెమ్యూనరేషన్ తక్కువే అవుతుంది. ఇక, ఆలియా భట్ విషయానికి వస్తే... ఆమె తొమ్మిది కోట్ల రూపాయలు తీసుకున్నారట. సినిమాలో ఆమె క్యారెక్టర్ నిడివి 20 నిమిషాలే ఉంటుందని టాక్. ఈ లెక్కన నిమిషానికి దగ్గర దగ్గర రూ. 50 లక్షలు తీసుకున్నారన్నమాట.

'ఆర్ఆర్ఆర్' సినిమాను సుమారు 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీశారు. అందులో రెమ్యూనరేషన్స్ కోసం 200 కోట్లు ఖర్చు అయినట్టు ఫిల్మ్ నగర్ గుసగుస. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన సినిమా ఇది. కరోనా లేకపోతే జనవరి 7న విడుదల అయ్యేది. కరోనా కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త విడుదల ఎప్పుడు ప్రకటిస్తారోనని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.

Also Read: Pawan Kalyan's Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్ 'హరి హర వీర మల్లు' లేటెస్ట్ అప్‌డేట్‌...
Also Read: శ్రీదేవి కూతుళ్లనూ వదలని వైరస్... ఇద్దరినీ చుట్టేసింది
Also Read: వాసివాడి తస్సాదియ్యా... 'బంగార్రాజు' ట్రైలర్ అదిరిందయ్యా!
Also Read: కరోనా బారిన పడ్డ స్టార్ హీరోయిన్..
Also Read: రాక్షసుల రాజ్యంలో రాముడిగా అక్కినేని మనవడు
Also Read: ఈసారి మెగా డాటర్ సినిమాలో కృతి శెట్టి? అది కూడా హీరోయిన్ ఓరియంటెడ్ కథలో...
Also Read: సోదరి రాజకీయాలకు, నా సేవకు సంబంధం లేదు... దేని దారి దానిదే! - సోనూ సూద్
Also Read: సిద్ధార్థ్ దేశానికి ఏం చేశాడు? కన్నీళ్లు పెట్టుకున్న సైనా నెహ్వాల్ తండ్రి
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola