జనవరి తొలి వారంలో తాను, తన సోదరి ఖుషి కరోనా బారిన పడ్డామని శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించారు. కరోనా వైరస్ సోకిన తొలి రెండు రోజులు భారంగా గడిచిందని ఆమె తెలిపారు. ఆ తర్వాత ప్రతి రోజూ కొంత కొంత మెరుగు అయ్యిందని పేర్కొన్నారు. వైరస్ నుంచి మనల్ని రక్షించుకోవడానికి ఏకైక మార్గం వ్యాక్సిన్ వేయించుకోవడంతో పాటు మాస్క్ ధరించడమేనని ఆమె తెలిపారు. బిఎంసి (బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) సూచించినట్టు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నామని, ఇప్పుడు తామిద్దరికీ నెగెటివ్ వచ్చిందని జాన్వీ కపూర్ స్పష్టం చేశారు.
ఇక, సినిమాలకు వస్తే... 'గుడ్ లక్ జెర్రీ', 'దోస్తానా 2' సినిమాల్లో జాన్వీ కపూర్ నటిస్తున్నారు. న్యూ యార్క్ నగరంలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేస్తున్న ఖుషి కపూర్, త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు.
Also Read: వాసివాడి తస్సాదియ్యా... 'బంగార్రాజు' ట్రైలర్ అదిరిందయ్యా!Also Read: కరోనా బారిన పడ్డ స్టార్ హీరోయిన్..Also Read: రాక్షసుల రాజ్యంలో రాముడిగా అక్కినేని మనవడుAlso Read: ఈసారి మెగా డాటర్ సినిమాలో కృతి శెట్టి? అది కూడా హీరోయిన్ ఓరియంటెడ్ కథలో...Also Read: సోదరి రాజకీయాలకు, నా సేవకు సంబంధం లేదు... దేని దారి దానిదే! - సోనూ సూద్Also Read: సిద్ధార్థ్ దేశానికి ఏం చేశాడు? కన్నీళ్లు పెట్టుకున్న సైనా నెహ్వాల్ తండ్రిఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి