రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ పై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వచ్చేస్తున్నాయి. ఆయన ఎక్కడో మాట జారితేనో.. లేకుంటే.. బీకామ్ లో ఫిజిక్స్ అని చెబితేనో కాదండి.. వాటిపై ఆయనకు మంచి క్లారిటీ ఉందిలేండి. కేవలం ఒక అభినందన సభలో పాల్గొనడంతోనే ఈ రచ్చ. ట్రోలర్స్ కు మంచి మీమ్స్ సబ్జెక్ట్ దొరికట్టైంది. ఇక నెటిజన్లైతే.. తమలోని హాస్యాన్నంతా రంగరించి.. కామెంట్ల రూపంలో చూపిస్తున్నారు. ఇంతకీ ఆయన హాజరైన ఆ అభినందన సభ ఏంటో తెలుసా?
ఆగండి..ఆగండి.. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఎవరో గోల్డ్ మెడల్..లేదో... ఇంకేదైనా సాధించి ఉంటారు అనేగా మీ డౌటనుమానం. అది కూడా అనుకోండి.. అందులో ఇంకో అభినందసభ కూడా ఉంది. ఓ మహిళ తన ఇన్ స్టా గ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ సాధించారు. ఆమె రాజమండ్రి నగరానికి చెందిన వ్యక్తి. రాజమండ్రి నగరంలో 1 మిలియన్ ఫాలోవర్స్ సాధించిన మెుదటి మహిళ అంటూ.. ఆయన ఫేస్ బుక్ లో రాసుకొచ్చారు. ఇక ఇది చూసిన నెటిజన్లు కామెంట్లతో కామెడీగా దాడి చేస్తున్నారు.
'అన్న నాకు కూడా ఇన్ స్టాలో 500 మంది ఫాలోవర్స్ ఉన్నారు. మా ఊర్లో నేనే టాప్ అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు'. 'ఇన్ స్టా గ్రామ్ ప్రజలకి ఏమైనా పనికొస్తుందా.. అసలు ఇలాంటి పోస్ట్ చేసేవారు ఎవరు? ఇలాంటి వాటితో క్రెడిబిలిడీ పోతుంది. ఇన్ స్టా గ్రామ్ అనేది పర్సనల్ విషయం. పబ్లిక్ లో పోస్ట్ చేయాల్సింది కాదు. అనవసరంగా ప్రతిపక్షానికి స్టాఫ్ ఇవ్వకండి.. సోషల్ మీడియా గ్రూప్ వాళ్లు.. ప్లీజ్ భరత్ గారి వాల్యూ తీయకండి..' అంటూ మరో నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే... వారణాసి హిందు యూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో 6 వ జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి అండర్ 7లో కేతా రుత్విక్ శ్రీరామ్ 2 గోల్డ్ మెడల్స్ సాధించాడు. అండర్ 11లో కేతా లలిత.. బంగారు పతకంతో పాటు రజతం సాధించింది. వీరిని కూడా ఎంపీ భరత్ అభినందించి సత్కరించారు. అయితే గోల్డ్ మెడల్ సాధించిన వాళ్లకు సంబంధించిన విషయాన్ని.. కింద రాసి.. 1 మిలియన్ ఇన్ స్టా ఫాలోవర్స్ సాధించిన అమ్మాయి గురించి పైన రాయడంతో నెటిజన్లు.. దీనిపైనా కామెంట్లు చేశారు.
Also Read: AP Tickets Issue : ఆర్జీవీతో 4 గంటలు.. కమిటీ మాత్రం 2 గంటలే చర్చ ! ఇక నివేదిక రెడీ చేస్తారా ?