సినిమా ఇండస్ట్రీకి చెందిన తారలు, దర్శకులు వేర్వేరు వ్యాపారాలు కూడా చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో చాలా మంది సినిమాల్లోనే పెట్టుబడులు పెడుతున్నారు. సినిమాల నిర్మాణం, స్టూడియోలు, థియేటర్లపై పెట్టుబడులు పెడుతున్నారు. కానీ కొందరు మాత్రం బయట వ్యాపారాలు చేస్తుంటారు. రెస్టారెంట్, నగల వ్యాపారం ఇలా వారి ఇంట్రెస్ట్ ను బట్టి వ్యాపారాలు మొదలుపెట్టారు.
ఇప్పుడు సీనియర్ హీరో వెంకటేష్ అలాంటి ప్రయత్నమే మొదలుపెట్టినట్లు సమాచారం. ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే వ్యాపారంలోకి వెంకటేష్ వాటాదారుడిగా ఉన్నారట. బైక్ వో అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గానే కాకుండా.. ఈ సంస్థలో వెంకటేష్ పెట్టుబడులు కూడా పెట్టారని తెలుస్తోంది.
ఫ్యూచర్ లో జనాలంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేవారికి రాయితీ ఇస్తున్నాయి. పొల్యూషన్ ను కంట్రోల్ చేయడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ పరిష్కారంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఛార్జింగ్ స్టేషన్ల డిమాండ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది.
పెట్రోల్ బంకుల తరహాలో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల అవసరం ఉండొచ్చు. కాబట్టి రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనేది బై వో కంపెనీ ప్లాన్. ఈ సంస్థకు వెంకటేష్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడంతో పాటు.. వ్యాపారంలో పెట్టుబడులు కూడా పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల 'నారప్ప', 'దృశ్యం 2' సినిమాలతో అలరించిన వెంకీ ఇప్పుడు 'ఎఫ్ 3' సినిమాలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: కనుబొమ్మలు ఎగరేసిన హీరోయిన్.. సిగ్గుపడిపోయిన చైతు.. వీడియో వైరల్..
Also Read: 'సార్' హీరోయిన్ తప్పుకుందా..? ఇదిగో క్లారిటీ..
Also Read: రేణుదేశాయ్, అకీరా నందన్ కు కోవిడ్ పాజిటివ్..