కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో స్ట్రెయిట్ సినిమాల్లో నటిస్తున్నారు. ముందుగా శేఖర్ కమ్ముల సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. రీసెంట్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా ఒప్పుకున్నారు ధనుష్. దీనికి 'సార్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మూడు రోజుల క్రితమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
శేఖర్ కమ్ముల సినిమా కంటే ముందుగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మలయాళ ముద్దుగుమ్మ సంయుక్తను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఆమె సడెన్ గా సినిమా నుంచి తప్పుకుందని వార్తలొచ్చాయి.
కారణమేంటో తెలియదు కానీ సంయుక్త మీనన్ ఈ ప్రాజెక్ట్ నుంచి వాకౌట్ చేసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఇందులో నిజం లేదని చెబుతోంది పీఆర్ టీమ్. 'సార్' సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సంయుక్త మీననే కనిపిస్తుందని క్లారిటీ ఇచ్చారు. కేరళకు చెందిన ఈ బ్యూటీ మలయాళ, తమిళ ఇండస్ట్రీలలో పదికి పైగా సినిమాల్లో నటించింది.
తెలుగులో ఆమె పవన్ కళ్యాణ్ 'భీమ్లానాయక్' సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో ఆమె రానా భార్యగా కనిపించనుంది. ఈ సినిమా విడుదల కాకముందే ఆమెకి బైలింగ్యువల్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే తెలుగులో సంయుక్త టాప్ రేంజ్ కి వెళ్లడం ఖాయం.
Also Read: రేణుదేశాయ్, అకీరా నందన్ కు కోవిడ్ పాజిటివ్..