మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. మహబూబాబాద్ మండలంలోని గడ్డిగూడెంలోని బావిలో ఇద్దరు పిల్లల మృతదేహలు గుర్తించారు. తండ్రి భూక్య రాము పిల్లలను బావిలో పడేసినట్లు స్థానికులు చెబుతున్నారు. నిందితుడు సీఆర్పీఎఫ్ జవాను. భార్య- భర్తల మధ్య గొడవలే ఈ ఘాతుకానికి కారణమని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించి, విచారణ ప్రారంభించారు. 


Also Read: Balayya Meets Harish Rao: మంత్రి హరీశ్ రావును కలిసిన బాల‌కృష్ణ.. ఆ విషయంలో సాయం కోసం విజ్ఞప్తి


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆడుకుంటున్న తన కొడుకు, కూతురిని తీసుకెళ్లి కన్న తండ్రి బావిలో పడేశాడు. మహబూబాబాద్ జిల్లాలోని గడ్డిగూడెం తండాకు చెందిన రామ్ కుమార్ అనే సీఆర్పీఎఫ్ జవాన్ తన ఇద్దరు కన్న బిడ్డలను కడతేర్చాడు. వారిని వ్యవసాయబావిలో పడేశాడు. పండుగ సెలవులు కావడంతో ఇంటివద్ద ఆడుకుంటున్న తన ఇద్దరు పిల్లలను నమ్మించి పొలం వద్ద ఉన్న బావి వద్దకు తీసుకెళ్లాడు. కొడుకు అమ్మి జాక్సన్, కూతురు జానీ బేస్టోను వ్యవసాయ బావిలోకి నెట్టాడు. ఇంకొద్ది రోజుల్లో కొడుకు పుట్టిన రోజు ఉండగా ఈ ఘోరం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.


Also Read: ఫ్లవరిస్టులు తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులు.. బీజేపీ నేతలపై మంత్రి ఎర్రబెల్లి సెటైర్లు


ఇది ఆలస్యంగా గమనించిన చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని పిల్లల్ని బయటకు తీసేలోపే వారు ప్రాణాలు కోల్పోయారు. పిల్లల్ని బావిలోకి తోసేసిన అనంతరం వారి తండ్రి అక్కడి నుంచి పారిపోయాడు. ఇలా కన్న పిల్లల్నే తండ్రి కాలయముడై చంపేయడం స్థానికుల్ని తల్లడిల్లిపోయేలా చేసింది. ఈ నిందితుడు ప్రస్తుతం ముంబయిలో సీఆర్పీఎఫ్ జవానుగా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య శిరీషతో కుటుంబ కలహాలు ఉన్నాయని ఇరుగుపొరుగువారు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.


Also Read: Mahabubnagar: బైక్‌పై లవర్స్ త్రిబుల్ రైడింగ్.. మధ్యలో శవం, ఇంతలో షాకింగ్ సీన్


Also Read: Nalgonda Crime: గుడి ముందు మనిషి తలకాయ, ఈ మిస్టరీ కీలక వివరాలు వెలుగులోకి.. మృతుడు ఎవరంటే..


Also Read: అరె ఏంట్రా ఇది.. లోన్ రిజెక్ట్ చేశారని ఏకంగా బ్యాంకునే తగలెట్టేశాడు, అంతా బూడిదే


Also Read: ఇవేం దరిద్రపు ఆలోచనలురా అయ్యా.. సెక్స్ కోసం భార్యల మార్పిడి.. సోషల్ మీడియా గ్రూపులు.. అందులో 1000 జంటలు  


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి