సెక్స్ కోసం కట్టుకున్న భార్యలనే మార్పిడి చేసుకుంటున్నారు కొంతమంది ప్రబుద్ధులు. ఈ సెక్స్ రాకెట్ లో 1000 జంటలు ఉన్నాయి. ఓ మహిళా బాధితురాలు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటకువచ్చింది. ఇన్నీ రోజులుగా కథ నడుపుతున్నవారి ఒక్కొక్కరి పేరు మెల్లగా బయటకు వస్తుంది. ఈ వార్త తెలిసిన వారు.. ఈ భార్యల మార్పిడి కథేందిరా అయ్యా అనుకుంటున్నారు.
కేరళలో సెక్స్ రాకెట్ బయటపడింది. ఓ మహిళ వచ్చి.. తన భర్త వేరే వ్యక్తితో శృంగారంలో పాల్గొనమంటున్నట్టు చెప్పడంతో ఈ కథ బయటకు వచ్చింది. ఇక పోలీసులు తవ్వుతుంటే విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. కేవలం లైంగిక సుఖం కోసమే.. తన భార్యలను మార్చుకుంటున్నారు. ఇలా 1000 జంటలు ఇందులో ఉన్నాయి. దీనికోసం వాళ్లు సోషల్ మీడియాలో గ్రూపులు కూడా మెయింటెన్ చేస్తున్నారు. ఓ మహిళను తన భర్త ఇలానే.. వేరే పురుషుడితో సంబందం పెట్టుకోవాలని తెగ ఒత్తిడి చేశాడు. అయితే ఆమె ఇలాంటి నీచమైన పనులేంటని ప్రశ్నించింది. తన భర్త చెప్పిన మాటలకు అస్సలు ఒప్పుకోలేదు. తన భర్తపై కొట్టయం జిల్లాలోని కరుకాచల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణ చేస్తుంటే.. లైంగిక సంబంధాల కోసం భార్యలను మార్చుకుంటున్నారనే విషయం బయటకు వచ్చింది. ఆమె భర్తతో సహా మరో ఆరుగురుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
అయితే వీళ్లంతా.. ఈ పాడు పనికోసం.. టెలిగ్రామ్, మెసెంజర్ గ్రూపులను వాడుతున్నారు. ఈ గ్రూపుల్లో సుమారు వెయ్యికి పైగా జంటలు ఉన్నాయి. ఇలానే వారు తమ భాగస్వాములను మార్పిడి చేసుకుంటున్నారని పోలీసుల అనుమానం. నిందితులంతా కేరళలోని మూడు జిల్లాలకు చెందినవారని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలువురు వ్యక్తులకు ఈ సెక్స్ రాకెట్‌తో సంబంధాలున్నట్లు గుర్తించారు. సమాజంలో పేరుప్రతిష్టలు ఉన్న వ్యక్తులే.. ఈ వ్యవహారంలో భాగమైనట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి మరో 25 మంది పరిశీలనలో ఉన్నారు. ఒకటి రెండు రోజుల్లో మరి కొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉంది.
లైంగిక సంబంధం కోసం నడుపుతున్న ఈ రాకెట్ లో డబ్బు కూడా చేతులు మారుతున్నాయట. 2019లో కాయంకులంలో భార్యల మార్పిడి నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు. అప్పుడు సోషల్ నెట్‌వర్క్ యాప్ అయిన షేర్‌చాట్ సాయంతో ఇలాంటి పనులు చేశారు.
Also Read: Khammam: మరికొన్ని గంటల్లో నిశ్చితార్థం ఇంతలో సూసైడ్... ఖమ్మం లాడ్జ్ లో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
Also Read: Warangal News: సంక్రాంతికి ఊరికి వెళ్లే వారు జాగ్రత్త.. పోలీసులకు సమాచారం ఇవ్వండి
Also Read: Hyderabad: కాలు విరిగినట్టు తెగ బిల్డప్.. పిలిచి ఆరా తీస్తే అసలు గుట్టు బయటికి..