అక్కినేని నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'బంగార్రాజు'. 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. ఇప్పటికే సినిమాలో కొన్ని పాటలను, టీజర్ ను విడుదల చేశారు. ఇటీవల మ్యూజికల్ నైట్స్ పేరుతో ఈవెంట్ ను నిర్వహించారు. 


ఈ సందర్భంగా స్టేజ్ పై నాగార్జున మాట్లాడుతుండగా.. ఓ ఫన్నీ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. మ్యూజిక్ అద్భుతంగా కుదిరిందని అనూప్ రూబెన్స్ ను నాగార్జున పొగుడుతున్న సమయంలో.. సడెన్ గా నాగచైతన్య వెనక్కి తిరిగి చూశారు. అక్కడే ఉన్న హీరోయిన్ దక్ష నగార్కర్ కూడా చైతు వైపు చూసింది. కనుబొమ్మలు ఎగరేస్తూ నవ్వింది. దీంతో చైతు సిగ్గుపడిపోయి నవ్వేశాడు. 


ఈ వీడియో చాలా క్యూట్ గా ఉంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. 'మెన్ విల్ బి మెన్' అంటూ క్యాప్షన్స్ ఇస్తున్నారు. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతిశెట్టిలతో పాటు మరో ఎనిమిది మంది హీరోయిన్లు సందడి చేయబోతున్నారు. సంక్రాంతికి 'బంగార్రాజు' పెర్ఫెక్ట్ సినిమా అని అంటున్నారు. దీనికి పోటీగా సరైన సినిమాలు లేకపోవడంతో కలెక్షన్స్ పరంగా 'బంగార్రాజు'కి కలిసి రావడం ఖాయం. ఇక ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. 






Also Read: 'సార్' హీరోయిన్ తప్పుకుందా..? ఇదిగో క్లారిటీ..


Also Read: రేణుదేశాయ్, అకీరా నందన్ కు కోవిడ్ పాజిటివ్..