'వద్దురా... సోదరా... పెళ్లంటే నూరేళ్ల మంటారా!ఆదరా... బాదరా... నువ్వు వెళ్లి వెళ్లి గోతిలో పడొద్దురా!డోంట్ మ్యారీ... బీ హ్యాపీ!'- కింగ్ అక్కినేని నాగార్జున హిట్ సినిమా 'మన్మథుడు'లో పాట. సరదాగా ఎవరైనా ఈ పాట పాడితే పెద్ద టాపిక్ అయ్యేది కాదు. నాగార్జున తనయుడు నాగచైతన్య పాడటం డిస్కషన్ పాయింట్ అయ్యింది.
నాగార్జున, నాగచైతన్య నటించిన 'బంగార్రాజు' సంక్రాంతి సందర్భంగా ఈ శుక్రవారం (జనవరి 14న) విడుదల కానుంది. ఈ సందర్భంగా 'బంగార్రాజుతో సంక్రాంతి సంబరాలు' అని జీ తెలుగు ఛానల్ ఓ ఈవెంట్ చేసింది. దానికి తండ్రీ కుమారులు ఇద్దరూ వచ్చారు. 'అంత్యాక్షరి'లో భాగంగా పాటలు పాడారు. అందులో నాగచైతన్య నోటి వెంట 'వద్దురా... సోదరా... పెళ్లంటే నూరేళ్ల మంటారా! గోతిలో పడొద్దురా! డోంట్ మ్యారీ... బీ హ్యాపీ' లైన్స్ వచ్చాయి. ఆడియన్స్ దాన్ని పట్టుకున్నారు. ఈ కార్యక్రమం శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు టెలికాస్ట్ కానుంది.
Also Read: అప్పుడు వదినగా... ఇప్పుడు స్పెషల్ సాంగ్ భామగా!Also Read: 22 ఏళ్ల తరువాత మెగాస్టార్ తో రవితేజ.. ఈసారి ఎలాంటి హిట్ కొడతారో..?Also Read: రిపోర్టులో 'నెగెటివ్'... ఫుల్ హ్యాపీగా త్రిష!Also Read: ఫూల్స్ డే రోజు మహేష్ రాడట.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?Also Read: అది గుడ్ జోక్ కాదు... సైనా నెహ్వాల్‌కు సిద్ధార్థ్ సారీ! అయితే... ఆ ఒక్కటీ ఒప్పుకోలేదు!ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి