India losing a series after going 1-0 up: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీసు ముగిసింది. ఆతిథ్య జట్టును ఓడిస్తుందనుకున్న టీమ్‌ఇండియాకు దక్షిణాఫ్రికా పెద్ద షాకే ఇచ్చింది! 0-1తో వెనకబడ్డ ఎల్గర్‌ సేన్‌ చివరికి 2-1తో గెలిచేసింది.  సిరీసులో తొలి టెస్టు గెలిచిన కోహ్లీసేన వరుసగా రెండు మ్యాచుల్లో ఓడటం అభిమానును బాధిస్తోంది. మొదట గెలిచి మిగిలిన మ్యాచుల్లో ఓడిపోవడంతో ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలా జరిగిన సందర్భాలు ఉన్నాయి.


* 1984/85లో ఇంగ్లాండ్‌ జట్టుకు టీమ్‌ఇండియా ఆతిథ్యం ఇచ్చింది. ఈ సిరీసులో మొదటి మ్యాచ్‌ గెలిచిన భారత్‌ ఆ తర్వాత రెండు ఓడి 1-2 సిరీస్‌ను చేజార్చుకుంది.
* 2002లో టీమ్‌ఇండియా వెస్టిండీస్‌లో పర్యటించింది. మొదటి మ్యాచ్‌ గెలిచిన భారత్‌ తర్వాత రెండు మ్యాచుల్లో ఓడి 1-2 సిరీస్‌ అప్పగించింది.
* 2006/07 సీజన్లో టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికాకు వెళ్లింది. అప్పుడూ 1-2తో ఇంటిబాట పట్టింది.
* 2012/13లో ఇంగ్లాండ్‌కు భారత్‌కు వచ్చింది. తొలి మ్యాచులో ఓడినా తర్వాతి మ్యాచులో గెలిచి సిరీసును 2-1తో కైవసం చేసుకుంది.
* 2014లో ఇంగ్లాండ్‌లో పర్యటించిన టీమ్‌ఇండియా తొలి మ్యాచ్ గెలిచి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మూడు మ్యాచుల్లో ఓడింది.
* తాజా దక్షిణాఫ్రికా సిరీసులో ఏం జరిగిందో తెలిసిందే. తొలి మ్యాచుల గెలిచిన భారత్‌ తర్వాత రెండు ఓడి 1-2తో ఓటమి పాలైంది.


ఇక కేప్‌టౌన్‌ టెస్టులో 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆడుతూ పాడుతూ మ్యాచ్ గెలిచేసింది. భారత బౌలర్లు దక్షిణాఫ్రికాను ఏ దశలోనూ ఇబ్బంది పెట్టలేకపోయారు. బుమ్రా, షమి, శార్దూల్ ఠాకూర్‌లకు తలో వికెట్ దక్కింది. కీగన్ పీటర్సన్ (82: 113 బంతుల్లో, 10 ఫోర్లు), వాన్ డర్ డసెన్ (41 నాటౌట్: 95 బంతుల్లో, మూడు ఫోర్లు), తెంబా బవుమా (32 నాటౌట్: 58 బంతుల్లో, ఐదు ఫోర్లు), డీన్ ఎల్గర్ (30: 96 బంతుల్లో, మూడు ఫోర్లు) రాణించారు.


మొదటి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యం సాధించినప్పటికీ భారత్ ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో పంత్, కోహ్లీ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ అందరూ దారుణంగా విఫలం అయ్యారు. అలాగే నాలుగో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. దీంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.






Also Read: IPL New Sponsor: వివో ఔట్‌! ఇకపై 'టాటా ఐపీఎల్‌'! చైనా కంపెనీకి గుడ్‌బై!!


Also Read: IPL Auction 2022 Date: క్రికెటర్లూ కాచుకోండి! ఇక డబ్బుల పండగే!! ఫిబ్రవరి 12, 13న ఐపీఎల్‌ మెగా వేలం


Also Read: Tata Group IPL Sponsor: మైదానంలో సిక్సర్ల వర్షం.. బీసీసీఐకి కాసుల వర్షం..! టాటా రావడంతో బోర్డుకు ఎంత డబ్బు వస్తోందంటే?