ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సరికొత్త సీజన్‌ వేలం గురించి ఐపీఎల్‌ పాలక మండలి స్పష్టతనిచ్చింది. ఆటగాళ్ల భారీ వేలం బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13న నిర్వహిస్తామని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ ఏఎన్‌ఐకి తెలిపారు. అంతేకాకుండా కొత్తగా వస్తున్న అహ్మదాబాద్‌, లఖ్‌నవూ ఫ్రాంచైజీలకు బీసీసీఐ  క్లియరెన్స్‌ ఇచ్చింది. ముగ్గురు చొప్పున క్రికెటర్లను ఎంపిక చేసుకొనేందుకు రెండు వారాల గడువు ఇచ్చింది.


Also Read: ప్రపంచకప్‌ గెలిపించినోడు..! ఆఖరి బంతిని చూడలేక వణికిపోయాడు!!


Also Read: ధోనిని కించపరుస్తూ కేకేఆర్ ట్వీట్.. జడ్డూ దిమ్మదిరిగే రిప్లై.. అది కేవలం షో ఆఫ్ మాత్రమే!


ఐపీఎల్‌ 2022 సీజన్‌ వేలాన్ని ఫిబ్రవరి 7, 8 తేదీల్లో నిర్వహిస్తారని బీసీసీఐ అధికారులు చెప్పినట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా జరిగిన పాలక మండలి సమావేశంలో మాత్రం వేరే నిర్ణయం వెలువడింది. 12, 13 స్థానాల్లో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే బోర్డు నిర్వహించే చివరి మెగా వేలం ఇదేనని సమాచారం. మూడు, నాలుగేళ్లకు ఒకసారి భారీ వేలం నిర్వహించడం వల్ల తాము తయారు చేసుకున్న ఆటగాళ్లను కోల్పోవాల్సి వస్తోందని ఫ్రాంచైజీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.


కొత్త సంవత్సరంలో ఐపీఎల్‌ను పది జట్లతో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సంజీవ్‌ గోయెంకాకు చెందిన వ్యాపార సంస్థ లఖ్‌నవూ ఫ్రాంచైజీని దక్కించుకోగా వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ సీవీసీ అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. మొన్నటి వరకు సీవీసీకి బీసీసీఐ క్లియరెన్స్‌ ఇవ్వలేదు. తాజా సమావేశంలో రెండు ఫ్రాంచైజీలకు క్లియరెన్స్‌ లభించింది. ఇక ఈ రెండు జట్లు తలో ముగ్గురు ఆటగాళ్లను ముసాయిదా నుంచి ఎంచుకోనున్నాయి. 






లఖ్‌నవూ ఫ్రాంచైజీ దూకుడుగానే కనిపిస్తోంది. ఇప్పటికే కేఎల్‌ రాహుల్‌, రషీద్‌ ఖాన్‌ను ఎంపిక చేసినట్టు తెలిసింది. మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ను మెంటార్‌గా నియమించుకుంది. గ్రాంట్‌ఫ్లవర్‌ను ప్రధాన కోచ్‌గా తీసుకుంది. పాత జట్లు మెగా ఆక్షన్‌ను వ్యతిరేకిస్తున్నాయి. తాము ఎంతో కష్టపడి రూపొందించుకున్న జట్లను త్యాగం చేయాల్సి వస్తోందని బాధపడుతున్నాయి. శ్రేయస్‌ అయ్యర్‌, శిఖర్ ధావన్‌, కాగిసో రబాడా, అశ్విన్‌ వంటి క్రికెటర్లను వదిలేయడం ఎంతో బాధగా ఉందని దిల్లీ ఫ్రాంచైజీ యజమాని పార్థ్‌ జిందాల్‌ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.