ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు ఉత్కంఠభరితంగా డ్రా అయిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా టెయిలెండర్లు చివరి వికెట్ పడకుండా మూడు ఓవర్లు నిలబడి మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. అయితే చివర్లో ఆస్ట్రేలియా పెట్టిన ఫీల్డింగ్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ పెట్టిన పోస్టు వివాదాస్పదం అయింది.


2016లో ఐపీఎల్‌లో ధోని బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గంభీర్ తన చుట్టూ ఫీల్డర్లను మోహరించాడు. ఆ ఫొటోను, నేటి యాషెస్ సిరీస్ ఫొటోను కలిపి ‘టెస్టుల్లో ఈ క్లాసిక్ మూవ్.. టీ20ల్లో మాస్టర్ స్ట్రోక్‌ను గుర్తుకు తెస్తుంది.’ అని క్యాప్షన్ పెట్టారు. అయితే వెంటనే ధోని అభిమానులు కోల్‌కతాపై విరుచుకుపడ్డారు.


దీంతోపాటు రవీంద్ర జడేజా కూడా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు దిమ్మదిరిగే రిప్లై ఇచ్చాడు. ‘అది మాస్టర్ స్ట్రోక్ కాదు.. కేవలం షో ఆఫ్ మాత్రమే’ అని దానికి రిప్లై ఇస్తూ ట్వీట్ చేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ధోని 33 బంతుల్లోనే 66 పరుగులు చేసిన వీడియోను కూడా తన అభిమానులు పోస్ట్ చేస్తున్నారు. మొత్తానికి కోల్‌కతా నైట్‌రైడర్స్ అనవసరంగా తనది కాని విషయంలో జోక్యం చేసుకుని నెగిటివిటీ ఎదుర్కుంటోంది.