Ashes Series, 4th Test: ప్రపంచకప్‌ గెలిపించినోడు..! ఆఖరి బంతిని చూడలేక వణికిపోయాడు!!

ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ యాషెస్‌ సిరీసు నాలుగో టెస్టు ఆఖరి ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్‌ను చూడలేకపోయాడు. ఆందోళనతో వణికిపోయాడు.

Continues below advertisement

Ben Stokes viral video: ఎన్నో మ్యాచులు ఆడినా.. ఎంత గొప్ప క్రికెటర్లైనా.. వారూ మానవ మాత్రులే కదా! క్రీజులో నిలబడి ఆఖరి బంతికి సిక్సర్లు కొట్టినవాళ్లైనా సరే కొన్ని సందర్భాల్లో ఉత్కంఠకు గురవుతుంటారు. నెర్వస్‌నెస్‌తో వణికిపోతుంటారు. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ కూడా అంతే! యాషెస్‌ సిరీసు నాలుగో టెస్టు ఆఖరి ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్‌ను చూడలేకపోయాడు. ఆందోళనతో వణికిపోయాడు.

Continues below advertisement

ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్‌ సిరీసులో ఇంగ్లాండ్‌ ఘోరంగా విఫలమైంది. 3-0తో సిరీసును చేజార్చుకుంది. తొలి మూడు టెస్టుల్లో పరాజయం పాలైంది. నామ మాత్రమైన నాలుగో టెస్టును ఆఖరి ఓవర్లో డ్రాగా మలిచింది. తొలి ఇన్నింగ్స్‌ను ఆసీస్‌ 416/8కి డిక్లేర్‌ చేసింది. ఉస్మాన్‌ ఖవాజా (137) అద్భుత శతకం బాదేశాడు. అతడికి తోడుగా స్టీవ్‌ స్మిత్‌ (67) హాఫ్‌ సెంచరీ చేశాడు.

బదులుగా ఇంగ్లాండ్‌ 249 పరుగులే చేసింది. జానీ బెయిర్‌ స్టో (113) సెంచరీ చేయగా బెన్‌స్టోక్స్‌ (66) అర్ధశతకంతో రాణించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఖవాజా (101) సెంచరీకి తోడుగా గ్రీన్‌ (74) చేయడంతో ఆసీస్‌ 265/6కు డిక్లేర్‌ చేసింది. 358 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ను ఆసీస్‌ ఆలౌట్‌ చేయలేకపోయింది. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి 270 పరుగులకు 9 వికెట్లు తీసింది. మరొక్క వికెట్‌ తీసుకుంటే ఫలితం వేరేలా ఉండేది.

వందో ఓవర్‌ ఆఖరి బంతికి జాక్‌ లీచ్‌ (26) ఔటయ్యాడు. దాంతో ఇంగ్లాండ్‌ 9 వికెట్లు చేజార్చుకుంది. మరొక్క వికెట్‌ పడితే ఆసీస్‌ విజయం ఖాయం. దాంతో 4-0తో సిరీసులో తిరుగులేని స్థితికి చేరుకుంటుంది. కానీ 101, 102 ఓవర్లకు ఆంగ్లేయులు వికెట్‌ పడకుండా ఆడేశారు.

చివరి ఓవర్‌ను స్టీవ్‌స్మిత్‌ విసిరాడు. అండర్సన్‌ క్రీజులో ఉన్నాడు. ఫీల్డర్లంతా పిచ్‌ వద్దకు చేరుకున్నారు. దాంతో స్మిత్ విసిరే ప్రతి బంతికీ మైదానంలో టెన్షన్‌ పెరిగిపోయింది. బెన్‌స్టోక్స్‌ సైతం అంతే! ఆ ఒత్తిడి, ఉత్కంఠను భరించలేక టీషర్టుతో తలను కప్పేసుకున్నాడు. నెర్వస్‌గా కనిపించాడు. కానీ ఇదే బెన్‌స్టోక్స్‌.. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆఖరి ఓవర్‌ వరకు ఆడి జట్టుకు ట్రోఫీ అందించాడు. ఏదైతేనేం.. చివరి ఆరు బంతుల్లో ఆంగ్లేయులు వికెట్‌ కాపాడుకోవడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

Also Read: IND vs SA, 2nd Test: టీమ్‌ఇండియా బౌలర్లు నా ఒంట్లో ఎముకలైనా విరగొట్టాలి! కానీ నేను ఔటవ్వను డాడీ!!

Also Read: Sachin Tendulkar: అభిమానులకు షాకిచ్చిన సచిన్‌..! కఠిన నిర్ణయం తీసుకున్న మాస్టర్‌ బ్లాస్టర్‌

Also Read: IND vs SA: మరే భారత ఆటగాడు బద్దలు చేయని సచిన్‌ 2 రికార్డులివి!

Continues below advertisement
Sponsored Links by Taboola