రియల్‌మీ 9 ప్రో కీలక స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో కనిపించాయి. ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు అందించనున్నారు. దీని స్క్రీన్ సైజు 6.59 అంగుళాలుగా ఉండే అవకాశం ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌ను ఇందులో అందించనున్నారని తెలుస్తోంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది.
రియల్‌మీ 9 ప్రో డిజైన్
దీనికి సంబంధించిన డిజైన్‌ను ప్రముఖ టిప్‌స్టర్ స్టీవ్ హెమ్మర్‌స్టోఫర్ లీక్ చేశారు. దీనికి సంబంధించిన రెండర్లు కూడా లీక్ అయ్యాయి. పైన తెలిపినట్లు ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిని దీర్ఘచతురస్రాకారంలో ఉన్న మాడ్యూల్‌లో అందించారు. ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఇందులో అందించారు. రెండర్లలో కిందవైపు బ్రాండింగ్ కూడా చూడవచ్చు.
రియల్‌మీ 9 ప్రో ముందువైపు ఫ్లాట్ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ అంచులు సన్నగా ఉండనున్నాయి. ముందువైపు హోల్ పంచ్ కటౌట్‌ను అందించారు. ఈ మధ్యకాలంలో లాంచ్ అవుతున్న రియల్‌మీ ఫోన్లలో ఈ తరహా డిస్‌ప్లేనే అందిస్తున్నారు. ఈ ఫోన్ మిడ్ నైట్ బ్లాక్, అరోరా గ్రీన్, సన్‌రైజ్ బ్లూ రంగుల్లో లభించే అవకాశం ఉంది.
రియల్‌మీ 9 ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా)
రియల్‌మీ 9 ప్రో కీలక స్పెసిఫికేషన్లు కూడా లీకయ్యాయి. ఇందులో 6.59 అంగుళాల డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉండనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ టెర్టియరీ సెన్సార్ కూడా ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది.
Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!