ఓమిక్రాన్ వేరియంట్ కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాలు వైరస్ వ్యాప్తితో తీవ్రంగా సతమతం అవుతున్నాయి. ఈ వేరియంట్‌పై నియంత్రణ కోసం అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా తేలిన అధ్యయనం మరింతగా కలవర పరుస్తోంది. ఈ వేరియంట్ కరోనా వైరస్ చివరి రూపాంతరం కాదని శాస్త్రవేత్తలు తేల్చారు. ఎందుకంటే భవిష్యత్తులో కూడా అలాంటి మరిన్ని వేరియంట్‌లను చూడవచ్చని చెప్పారు. తొలుత వచ్చిన ఇన్ఫెక్షన్ కారణంగా, ఈ వైరస్ పరివర్తన చెందడానికి అవకాశం ఉంటుందని.. మరింత అధునాతనమైన వ్యాక్సిన్ కనుగొన్నప్పటికీ ఇది ప్రజలకు సోకుతోందని అభిప్రాయపడ్డారు.


బోస్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తాజాగా ఓ పరిశోధన చేశారు. వీరిలో ఎపిడెమియాలజిస్ట్ లియోనార్డో మార్టినస్ మాట్లాడుతూ.. ఈ ఓమిక్రాన్ వేరియంట్ ఎక్కువ మందిలో మరింతగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. అయితే, ఓమిక్రాన్ తదుపరి వేరియంట్ ఎలా ఉంటుందో.. అది అంటువ్యాధిని ఎలా కలిగిస్తుందో మాత్రం తమకు తెలియదని అన్నారు. ఓమిక్రాన్‌కు తర్వాతి వేరియంట్ తేలికపాటి వ్యాధికి కారణమవుతుందని గానీ, లేదా ప్రస్తుత వ్యాక్సిన్ సమర్థంగా ఎదుర్కొంటుందని గానీ ఎలాంటి గ్యారెంటీ లేదని అన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌ను త్వరితగతిన కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత వ్యాక్సిన్ ఈ మహమ్మారి ప్రస్తుత వేరింట్‌పై పోరాడడంలో మాత్రం ప్రభావవంతంగా ఉందని చెప్పారు.


వేగమైన వ్యాప్తితో మరింత ఆందోళన
వేగంగా వ్యాప్తి చెందడం వల్ల ఓమిక్రాన్ మరిన్ని మ్యుటేషన్లను సృష్టించే అవకాశం ఉంటుందని, దీని వల్ల మరిన్ని వేరియంట్‌లు వచ్చే అవకాశం ఉందని అన్నారు. నవంబర్ మధ్యలో ఈ వేరియంట్ వచ్చినప్పటి నుండి, ఇది ప్రపంచవ్యాప్తంగా దావానంలా వ్యాపించింది. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఓమిక్రాన్ వేగాన్ని నాలుగు రెట్లు పెంచుతుందని తాజా పరిశోధనలో తేలింది.


ఓమిక్రాన్ వేరియంట్ సంక్రమణ ప్రస్తుతం వ్యాక్సిన్ డోసులు అన్నీ పూర్తయిన వ్యక్తులకు కూడా సోకుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, జనవరి 3 నుంచి 9 తేదీల మధ్య, ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇది అంతకుముందు వారం కంటే 55 శాతం ఎక్కువగా ఉన్నట్లుగా డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.


Also Read: సముద్ర గర్భంలో బద్దలైన అగ్నిపర్వతం.. ముంచెత్తిన సునామీ.. శాటిలైట్ వీడియో వైరల్


Also Read: వామ్మో.. ఇలా ఉందేంటి? అమెరికన్లను వణికిస్తున్న ‘ఐస్ డిస్క్’..


Also Read: ఓర్నీ.. చేప వీర్యంతో స్పెషల్ కర్రీ.. అంత కరువేంది బ్రో!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి